అనుష్క కి ఇంత తక్కువ పారితోషకమా..?

koratala condition to anushka

ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ లలో స్టార్ హీరోయిన్స్ అంటే అనుష్క, నయనతార, కాజల్ గుర్తొస్తారు. అనుష్క గత కొంత కాలం నుండి తెలుగులో చాలా తక్కువ సినిమాలే చేస్తుంది. ఏది పడితే అది ఒప్పుకోకుండా జాగ్రత్తగా తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుంది. నయనతార విషయానికి వస్తే తమిళంలో లేడీ సూపర్ స్టార్ గా వెలుగొందుతోంది. ఈమెకు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. అయితే నయన్ ఒక సినిమాకి 4 నుండి 5 కోట్లు వరకు తీసుకుంటుంది. ఆ తరువాత స్థానంలో అనుష్క ఉంది అనుకున్నారు అంతా.

కాజల్ కంటే తక్కువ

కానీ అనుష్క మాత్రం అందరూ అనుకుంటున్నట్టు ఎక్కువ పారితోషకం తీసుకోట్లేదని సమాచారం. రీసెంట్ గా ఆమె చేయబోయే సినిమా రెమ్యూనరేషన్ చుస్తే ఈ విషయం అర్థం అవుతుంది. హేమంత్ మధుకర్ అనే దర్శకుడితో అనుష్క ఓ సినిమా ఓకే చేసింది. అయితే ఈ సినిమాకి అనుష్క ఎవరూ ఊహించని విధంగా 1.25 కోట్లు మాత్రమే తీసుకున్నట్టుగా ఫిలింనగర్ టాక్. కాజల్ కన్నా అనుష్క తక్కువ తీసుకోవడం ఆశ్చర్యం కలిగించే అంశం. అయితే మొదటి నుండి అనుష్క పాత్రలకే ఇంపార్టెన్స్ ఇచ్చింది కానీ రెమ్యూనరేషన్స్ కి కాదని తన సన్నిహితులు చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*