కోపంతో చేయి చేసుకున్న బెల్లంకొండ..?

bellamkonda suresh distributer

బెల్లంకొండ శ్రీనివాస్ మార్కెట్ 30 కోట్లు దాటకపోయినా నిర్మాతలు మాత్రం భారీగా ఖర్చు పెడుతుంటారు. అయితే శ్రీనివాస్ సినిమాలు రికవరీ విషయంలో 25, 30, 35 కోట్ల దగ్గరే ఆగిపోతున్నాయి. కొన్ని సినిమాలు రికవరీ కూడా కష్టమవుతున్నాయి. అలాంటి వాటిలో సాక్ష్యం, రీసెంట్ గా వచ్చిన కవచం సినిమాలు ఉంటాయి. శ్రీనివాస్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని సినిమాకి బడ్జెట్ పెడితే.. లాభాలు రాకపోయినా నష్టాలైతే రావు. అయితే శ్రీనివాస్ నిర్మాతలు సేఫ్ అయినా సినిమాలు కొన్న డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం నష్టపోతున్నారు. ఎంతోకొంత లాస్ అవుతున్నారు. తాజాగా విడుదలైన కవచం సినిమాకి 30 కోట్లు పైనే ఖర్చు పెట్టినా… సినిమాకి థియేటర్స్ నుండి వచ్చింది 10 కోట్లు కూడా లేదు. ఏదో శాటిలైట్ హక్కులు, డిజిటల్ హక్కులకు ఎంతో కొంత వచ్చినా.. థియేటర్ హక్కులు కొన్న డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం భారీగా లాస్ అయ్యారు.

గొడవ అయితే జరిగింది కానీ…

అయితే 30 శాతం కంటే ఎక్కువగా ఒక డిస్ట్రిబ్యూటర్ నష్టపోతే గనుక సదరు నిర్మాత డబ్బులు వెనక్కి ఇవ్వాల్సి వస్తుందనే అగ్రిమెంట్ ను ఎప్పటి నుండో కొందరు నిర్మాతలు ఫాలో అవుతుంటారు. అయితే కవచం సినిమాకి కూడా అదే తరహాలో తమకు లాస్ వచ్చింది గనక నిర్మాతని, అలాగే శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ ని డబ్బులు వెనక్కి ఇవ్వమని కవచం డిస్ట్రిబ్యూటర్స్ అడిగారట. అయితే ఆ డిస్ట్రిబ్యూటర్లలో ఒకరితో బెల్లంకొండ సురేష్ గొడవ పెట్టుకోవడమే కాక చెయ్యి కూడా చేసుకున్నాడట. అయితే ఆ విషయం నిజామా కదా అని సురేష్ ని అడగగా… హా అవును డిస్ట్రిబ్యూటర్ తో గొడవ అయ్యింది కానీ కొట్టలేదని చెబుతున్నాడట. మరి శ్రీనివాస్ సినిమాలకు ఇకనైనా నిర్మాతలు చూసి పెట్టుబడి పెట్టకపోతే ఈ తరహా ఘటనలు జరుగుతూనే ఉంటాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*