బిగ్ బాస్ – 3లో ఉండేది వీరేనా..?

big boss 3 contestents

బిగ్ బాస్ సిరీస్ హిందీలో లాగా తెలుగులోనూ మంచి పాపులర్ అయింది. వరుసగా రెండు సీజన్స్ మంచి సక్సెస్ అయ్యాయి. రీసెంట్ గా బిగ్ బాస్ 2 చాలా గ్రాండ్ గా ముగియడంతో సీజన్ 3 ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే సీజన్ 3 కూడా స్టార్ట్ చేసే ప్రయత్నాల్లో బిగ్ బాస్ నిర్వాహకులు సన్నాహాలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి బిగ్ బాస్ లో సందడి చేసే కొంతమంది సెలబ్రిటీల పేర్లు కొన్ని సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మొదటి సీజన్ తో పోల్చుకుంటే రెండో సీజన్ లో అంతగా అట్రాక్ట్ చేసే సెలెబ్రెటీస్ లేరు. కానీ షో సక్సెస్ అయింది.

హోస్ట్ ఎవరు..?

అయితే ఈసారైనా మంచి సెలెబ్రెటీస్ తో షో నిర్వహిస్తారని ప్రేక్షకులు భావిస్తున్నారు. సీజన్ 3 లో కొంతమంది పేర్లు బయటికి వచ్చాయి. రేణు దేశాయ్, ఉదయభాను, శోభిత ధూళిపాల, గద్దె సిందూర, యూట్యూబ్ స్టార్ జాహ్నవి, వరుణ్ సందేశ్, కమల్ కామరాజు, జాకీ, హేమచంద్ర, రఘు మాస్టర్, ‘జబర్దస్త్’ పొట్టి నరేశ్ తదితరులు పాల్గొననున్నారనే ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రచారం అయితే గట్టిగా జరుగుతుంది. సీజన్ 3కి హోస్ట్ గా చిరంజీవి లేదా వెంకటేష్ చేసే అవకాశం ఉందనీ ప్రచారం జరుగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*