వెంకిమామ నిర్మాతతో దర్శకుడు బాబీ బెంబేలు.!

boby afraid of suresh babu

సురేష్ ప్రొడక్షన్స్ లో సురేష్ బాబు నిర్మాతగా… వెంకటేష్ – నాగ చైతన్యలు కలిసి నటిస్తున్న ‘వెంకీమామ’ చిత్రం బాబీ దర్శకత్వంలో మొదలైంది. కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం సజావుగా సాగడం లేదనేది ఇన్ సైడ్ టాక్. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది అనుకుంటున్న ‘వెంకిమామ’ షూటింగ్ కి అడుగడుగునా బ్రేక్ పడుతుందట. నాగ చైతన్య మొదటి షెడ్యూల్ లో పాల్గొంటున్నాడని చెప్పారు. ఇక వెంకటేష్ కూడా ‘ఎఫ్ 2’ షూటింగ్ పూర్తి కాగానే వెంకిమామ షూటింగ్ లో జాయిన్ అవుతున్నాడని అన్నారు. అయితే రెగ్యులర్ షూటింగ్ లో జరుగుతున్నప్పటికీ కొంత గందరగోళంతోనే షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతుందట.

సంతృప్తి చెందని సురేష్ బాబు…

అలా ఎందుకు జరుగుతుంది అంటే… నిర్మాత సురేష్ బాబుకి ‘వెంకీ మామ’ స్క్రిప్ట్ తృప్తినివ్వడం లేదట. అసలు సినిమా మొదలవ్వక ముందే సురేష్ బాబు ఈ విషయం మీద కాస్త సీరియస్ గా ఉన్నాడనే న్యూస్ నడిచింది. తాజాగా కూడా సురేష్ బాబు ‘వెంకీమామ’ స్క్రిప్ట్ మీద ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాడట. ఏడెనిమిది సార్లు సీన్ ఆర్డ‌ర్లు, ట్రీట్‌మెంట్లూ మార్చుకుంటూ వెళ్లడం…. అయిన‌ప్ప‌టికీ సంతృప్తి క‌ల‌గ‌లేద‌నేది ఇన్సైడ్ టాక్. అసలు ఇప్ప‌టికీ స్క్రిప్టుపై సురేష్ బాబు ఆమోదముద్ర ప‌డ‌లేద‌ని తెలుస్తోంది. అందుకే షూటింగ్ సక్రమంగా జరగడం లేదట. సురేష్ బాబు తాను నిర్మించే సినిమాల విషయంలో మామూలుగానే ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంటాడు.

బాబీ హ్యాండ్ ఇస్తాడా..?

ఇక తన సొంత తమ్ముడు, మేనల్లుడి సినిమా కావడంతో.. ఈ ‘వెంకిమామ’ విషయంలో మరింత ఇన్వాల్వ్ అవుతున్నాడట. అందుకే దర్శకుడు బాబీకి ఏం చెయ్యాలో పాలుపోక.. సురేష్ బాబు వైఖరికి బెంబేలెత్తుతున్నాడట.. ఇక ఏ హీరోలూ తనకి దొరక్క సురేష్ బాబు చెప్పింది చెయ్యడానికి ఒప్పుకున్న బాబీ ఇప్పుడు సురేష్ బాబు చేష్టలకు విసిగిపోయి.. దర్శకుడిగా సినిమాకి హ్యాండ్ ఇచ్చినా ఇవ్వొచ్చనే ఊహాగానాలు బయలుదేరాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*