టాలీవుడ్ బాటలో బాలీవుడ్ అందం..!

బాలీవుడ్ హీరోయిన్స్ ఇపుడు టాలీవుడ్ సినిమాల్లో తెగ నటించేస్తున్నారు. ఇదివరకు స్టార్ హీరోల సరసన మాత్రమే ఆడిపాడే బాలీవుడ్ హీరోయిన్స్.. ఇప్పుడు ఇక్కడ మాములు హీరోల పక్కన కూడా నటించేస్తున్నారు. అక్కడ వర్కౌట్ కాకపోతే ఇక్కడ అన్నట్టుగా ఉంది ఈ కాలం హీరోయిన్స్ పరిస్థితి. ఇక బాలీవుడ్ లో ఐశ్వర్య రాయ్ అంత అందం, కాజల్ అంత గడుసుతనం ఉన్నప్పటికీ.. అక్కడ హీరోయిన్ గా మాత్రం చక్రం తిప్పలేకపోతుంది ఊర్వశి రౌతేలా. అందం పోత పోసినట్టుగా ఉండే ఈ హాట్ హీరోయిన్ నటించింది వేళ్ల మీద లెక్కపెట్టెన్ని సినిమాలే అయినా… హేట్ స్టోరి 4 సినిమాలో అంగాంగ ప్రదర్శన చేసింది.

అన్నీ ఉన్నా… ఆఫర్స్ లేక…

సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా అందాలు ఆరబోసిన గ్లామర్ ఫొటోస్ ని పోస్ట్ చేస్తూ.. ఈ అమ్మాయి ఇక బాలీవడ్ ని ఎలేస్తుందని అనుకునే సమయంలో ఆఫర్స్ లేక అల్లాడుతోంది. హేట్ స్టోరి 4లో ఎటువంటి మొహమాటం పడకుండా అదరగొట్టిన ఈ భామకు బాలీవుడ్ లో అవకాశాలు మాత్రం కరువయ్యాయి. ఐశ్వర్య రాయ్ లాంటి అందంతో అద్భుతంగా బాలీవుడ్ లో పాగా వేస్తుంది అనుకుంటే… ఇప్పటికీ ఈ భామ బిజీ కాలేకపోతుంది. ఇక అవార్డు ఫంక్షన్స్ లో, సినిమా ఈవెంట్స్ లో అదరగొట్టే డ్రెస్సులతో మత్తెక్కించే ఊర్వశి ఇప్పుడు టాలీవుడ్ లోకి దిగబోతున్నట్లుగా తెలుస్తుంది.

స్టార్ హీరో సినిమా అంటే…

టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఊర్వశి రౌతేలా ఐటెం సాంగ్ లో కనిపించబోతున్నట్టుగా చెబుతున్నారు. టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో చేసే భారీ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయమని ఉర్వశిని దర్శకనిర్మాతలు సంప్రదించారట. అందుకు ఆమె అంగీకరించిందని… పారితోషికంగా ఆమెకి భారీ మొత్తం ఆఫర్ చేసినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. మరి స్టార్ హీరోలంటే… రామ్ చరణ్ – బోయపాటి సినిమా ఒకటి లైన్ లో ఉంది. అలాగే ప్రభాస్ సాహో తో పాటు… రాధాకృష్ణ మూవీ ఉంది. ఇక ఎన్టీఆర్ ఖాళీ, అల్లు అర్జున్ ఖాళీ, ఇక మహేష్ మహర్షి కూడా ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న సినిమా. మరి ఊర్వశి చిందేయ్యబోయే ఆ స్టార్ హీరో సినిమా ఏది అనే ఆసక్తితో ఉన్నారు ప్రేక్షకులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*