బోయపాటిని ముప్పుతిప్పలు పెడుతున్న చెర్రీ?

ప్రస్తుతం రామ్ చరణ్ – బోయపాటి సినిమా సెట్స్ మీదుంది. రామ్ చరణ్ కోసం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని చాలా కాలం వెయిట్ చేసిన బోయపాటి.. ఎట్టకేలకు చెర్రీ తో కలిసి షూటింగ్ మొదలు పెట్టాడు. మొన్నటికి మొన్న రంగస్థలం హిట్ తో చరణ్ తన నెక్స్ట్ సినిమా కూడా పర్ఫెక్ట్ గా ఉండాలనుకుంటున్నట్లుగా బోయపాటికి స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చెప్పినట్టుగా వార్తలొచ్చినప్పటికీ… బోయపాటి – చరణ్ లు ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ కోసం బ్యాంకాక్ వెళుతున్నారని అధికారిక సమాచారంతో ఆ గాసిప్స్ కి ఫుల్ స్టాప్ పడింది.

అయితే తాజాగా ఇప్పుడు బోయపాటి తెరకెక్కించిన కొన్ని సీన్స్ కి చరణ్ రి షూట్ చెయ్యమన్నాడనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. చరణ్ తో పాటుగా ఈ సినిమలో హీరోయిన్ గా నటిస్తున్న కైరా అద్వాని, స్నేహ, తమిళ హీరో ప్రశాంత్ కాంబినేషన్లో బోయపాటి కొన్ని సీన్స్ ను ఈ మధ్యనే షూట్ చేసాడట. అయితే బోయపాటి సన్నివేశాలను చిత్రీకరించిన తీరు చరణ్ కి సంతృప్తికరంగా అనిపించలేదట. అందుకే చరణ్ మొహమాటం లేకుండా ఆ ఆర్టిస్టుల డేట్స్ మళ్లీ తీసుకుని .. రీ షూట్ పెట్టమని బోయపాటికి చరణ్ చెప్పినట్లుగా ఫిలింసర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరి ప్రస్తుతం చెర్రీ – బోయపాటి సినిమా తదుపరి షెడ్యూల్ ను బ్యాంకాక్ లో ప్లాన్ చేశారు. మరి ఈ నెల 12వ తేదీ నుంచి ఓక్ 15 రోజుల పాటు బ్యాంకాక్ లో షూటింగ్ జరిపిన తర్వాత హైదరాబాద్ కి తిరిగి వచ్చి చరణ్ చెప్పిన సీన్స్ ని బోయపాటి రీ షూట్ పెడతాడనే టాక్ మాత్రం హైలెట్ అయ్యింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*