బోయపాటికి పెద్ద టెన్షన్..!

boyapati sreenu responsible for vvr flop

రామ్ చరణ్ – బోయపాటి కాంబినేషన్ లో సంక్రాంతికి రెడీ అవుతున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. పక్కా మాస్ ఎంటర్టైనర్ తో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ చేసుకుంది. ఒక్క ఐటెం సాంగ్ బాలన్స్ ఉందంటే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ లో ఉన్న ఈ సినిమా సెన్సార్ కి కూడా రెడీ అవుతున్నట్టు సమాచారం. అయితే ఈ ఐటెం సాంగ్ కు ఏ హీరోయిన్ దొరక్క తెగ ఇబ్బంది పడుతున్నాడట బోయపాటి.

ఇలియానా సూట్ అవ్వదనే…

గత కొన్ని రోజులు నుండి సాంగ్ కోసం ఇలియానాను తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఆమె ఈ సాంగ్ చేసేందుకు 60 లక్షలు డిమాండ్ చేయడంతో డ్రాప్ అయ్యారని వార్తలు వచ్చాయి. ఇందులో ఎటువంటి నిజం లేదని టీం కొట్టిపారేసింది. ఇలియానా చరణ్ పక్కన సూట్ అవ్వదని… ఆమె చరణ్ పక్కన చేస్తే అక్కలా ఉంటుందని అందుకే ఆమెను తీసుకోలేదని తెలుస్తుంది.

రకుల్ లేదా రాశీ ఖన్నానే…

రకుల్ లేదా రాశీ ఖన్నా చరణ్ తో స్టెప్స్ వేసే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి ఇది నిజమో కాదో తెలియదు. తమన్నాను ట్రై చేద్దామా అంటే కాల్ షీట్ సమస్య ఉందని సమాచారం. కాజల్ కూడా వరస సినిమాలతో బిజీగా ఉంది. ఆలా భామను పట్టడం విధేయ రామకు పెద్ద ఛాలెంజ్ గా మారింది. విడుదల తేదీ దగ్గరకు వస్తుంది. రామ్ చరణ్ ఏమో రాజమౌళి సినిమాలో బిజీగా ఉన్నాడు. మరి బోయపాటి ఎవరిని సెట్ చేసి చరణ్ తో స్టెప్స్ వేయిస్తాడో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*