మహేష్ డైరెక్టర్ కు ఓకే చెప్పిన చరణ్..!

డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్ వేరు.. అతని టేకింగ్ వేరు. అన్ని వర్గాల ప్రేక్షకులని థియేటర్స్ కు రప్పించగల సత్తా ఉన్న డైరెక్టర్ వంశీ. గతంలో ఆయన చేసిన సినిమాలే అందుకు ఉదాహరణ. ప్రస్తుతం వంశీ..మహేష్ తో ‘మహర్షి’ అనే సినిమా చేస్తున్నాడు. మహేష్ 25వ చిత్రంగా వస్తున్నా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ‘భరత్ అనే నేను’ లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత వస్తున్న చిత్రం కాబట్టి మహేష్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు. మహేష్.. లవ్ బాయ్ గా కనిపిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ అవుతుంది. ఇది ఇలా ఉంటే డైరెక్టర్ వంశీ పైడిపల్లి రీసెంట్ గా రామ్ చరణ్ కు ఓ స్టోరీ లైన్ చెప్పాడట. ఆ లైన్ చరణ్ కు కూడా నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పినట్టుగా తెలుస్తుంది.

రాజమౌళి సినిమా కంటే ముందే…

ప్రస్తుతం చరణ్..బోయపాటి డైరెక్షన్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళితో మల్టీ స్టారర్ లో నటించనున్నాడు. రాజమౌళి సినిమా కంప్లీట్ అవ్వడానికి ఎలాగూ ఏడాది పైనే పడుతుందని, కాబట్టి ఈలోపు ఖాళీ దొరికితే వంశీ పైడిపల్లితో కలిసి సెట్స్ పైకి వెళ్లే ఆలోచనలో చరణ్ ఉన్నాడట. అందుకే వంశీ ఒక పక్క మహేష్ సినిమా చేస్తూనే మరోపక్క చరణ్ సినిమా స్టోరీ ని రెడీ చేసే పనిలో ఉన్నాడట. గతంలో వీరి కాంబినేషన్ లో ‘ఎవడు’ అనే సినిమా వచ్చి హిట్ అయిన సంగతి తెలిసిందే.