విజయ్ కి చిరు హిట్ సినిమా టైటిల్..!

vijay devarakonda

ఈమధ్య మనవాళ్లకి సినిమాలకి టైటిల్స్ పెట్టడానికి దొరకటం లేదేమో… పాత సినిమాల టైటిల్స్ ని పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్టార్ ఇమేజ్ కు ఓ పునాదిరాయిగా మారిన ‘హీరో’ సినిమా టైటిల్ ను ఇప్పుడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సినిమాకి వాడుతున్నారు. అది కూడా మెగా ఫామిలీ హీరో కాదు.. యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ సినిమాకి ఈ టైటిల్ ను వాడుకుందాం అని చూస్తున్నాడు. విజయ్ ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్ క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో ఇంకో సినిమా చేయనున్నాడు.

టైటిల్ రిజిస్టర్ చేసిన నిర్మాత

ఈ రెండు సినిమాల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఇంకో సినిమా స్టార్ట్ చేయనున్నాడు. ఆ ప్రాజెక్ట్ కి ‘హీరో’ అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారు. ఈ నేపధ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ వారు ఫిలిం ఛాంబర్ లో ‘హీరో’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. మరి ఈ ప్రాజెక్ట్ కు డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా తెలియదు. కానీ రామకృష్ణ ఆర్ట్ డైరక్టర్ గా వర్క్ చేయబోతున్నాడు. అతడే మీడియాకు ఈ విషయాన్ని లీక్ చేశాడు. మరోపక్క తమిళంలో కొత్త దర్శకుడితో ఇంకో సినిమా చేయనున్నాడు విజయ్. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పలేం. ఆలా వరస సినిమాలతో బిజీ అయిపోయాడు విజయ్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*