మరో ఇద్దరు హీరోయిన్స్ మధ్య కోల్డ్ వార్..!

tamil films promotions in telugu

మొన్నామధ్యన బెల్లంకొండ శ్రీనివాస్ సరసన కవచంలో నటించిన కాజల్ అగర్వాల్ కి, మెహ్రీన్ కౌర్ కి మధ్యన కోల్డ్ వార్ జరిగినట్లుగా చాలా వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే కాజల్ కి, మెహ్రీన్ కి మధ్యన కోల్డ్ వార్ అనే న్యూస్ చూసిన ఈ హీరోయిన్స్ ఇద్దరూ తమ మధ్యన ఏం లేదు అన్నట్లుగా ట్వీట్స్ తో సమాధానం చెప్పారు. కానీ… కాజల్, మెహ్రీన్ లు కవచం ప్రమోషన్స్ లో కలిసి పాల్గొనకపోయే సరికి అందరూ నిజంగానే వారి మధ్యలో ఏదో ఉందని అన్నారు. తాజాగా మరో ఇద్దరు హీరోయిన్స్ మధ్యన కూడా కోల్డ్ వార్ అంటూ న్యూస్ వస్తుంది. అది కూడా నిన్న గాక మొన్న విడుదలైన అంతరిక్షం సినిమాలో వరుణ్ తేజ్ సరసన నటించిన హీరోయిన్స్ అదితీ రావు హైదరి, లావణ్య త్రిపాఠి ల మధ్యన ఇగో క్లాష్ వచ్చినట్లుగా ఇప్పుడు మరో న్యూస్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.

లావణ్య త్రిపాఠి అందుకే రాలేదా..?

అయితే వారి మధ్యన నిజంగానే ఈగో క్లాష్ ఉన్నట్లుగా చెబుతున్నారు. ఎందుకంటే వీరిద్దరూ అంతరిక్షం ప్రమోషన్స్ కి హాజరవడం లేదని.. అందుకే వారి మధ్యన కోల్డ్ వార్ ఉందంటున్నారు. అంతరిక్షం సక్సెస్ మీట్ లో లావణ్య త్రిపాఠి కనబడకపోయే సరికి అందరూ దానికి అదితినే కారణంటున్నారు. అదితితో అడ్జెస్ట్ అవలేక.. లావణ్య అంతరిక్షం టీంని ఇబ్బంది పెట్టిందని… అదితి సక్సెస్ మీట్ కి వస్తే.. నేను రానని లావణ్య త్రిపాఠి మొండిగా చేసిందని… ఈ హీరోయిన్స్ మధ్యన ఉన్న ఈగో వలన అంతరిక్షం ప్రమోషన్స్ సజావుగా సాగడం లేదని… హీరోయిన్స్ వలన అంతరిక్షం టీం ఇబ్బంది పడుతుందంటూ… చెబుతున్నారు. మరి ఈ న్యూస్ పై అదితి, లావణ్యల స్పందన ఏమిటో.?

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*