మహర్షి విషయంలో నిర్మాతల తలో మాట..!

maharshi movie leak

ఇద్దరు ముగ్గురు నిర్మాతలు ఒకే సినిమా చేస్తున్నారు అంటే… ఆ సినిమా ప్రొడక్షన్ విషయంలో, బిజినెస్ విషయం లో.. ముగ్గురు నిర్మాతలు ఒకే మాట మీద ఉండరు. ఎవరి మాట వారిదే ఉంటుంది. ఎవరి పంతాలు వాళ్లవే. ఇదే విషయంలో మహర్షి విషయంలోనూ జరుగుతుంది. గత ఏడాది అశ్వినీదత్ సమర్పిస్తూ.. దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి దర్శకుడిగా ప్రారంభమైన మహర్షి చిత్రం మొదలయ్యే నాటికి ముగ్గురు నిర్మాతలు వచ్చి చేరారు. కేవలం సమర్పణతో సరిపెట్టుకుంటానన్న అశ్వినీదత్ నిర్మాతగా మారాడు. ఇక అక్కడే దిల్ రాజుగా అడ్జెస్ట్ అయ్యాడు. కానీ సినిమా మొదలయ్యే సమయానికి పీవీపీ బలవంతంగా మహర్షి నిర్మాణంలోకి వచ్చాడు.

ముగ్గురి మద్య అభిప్రాయ బేధాలు

ఇక చేసేది లేక దిల్ రాజు, అశ్వినీదత్ తోనూ, పీవీపీతోను సర్దుకుపోవాల్సి వచ్చింది. అయితే సినిమా నిర్మాణంలో మాత్రం ఎంతో పక్కాగా ఉంటున్న ఈ ముగ్గురికి ఆ సినిమా బిజినెస్ విషయంలో తేడాలొస్తున్నట్టుగా ఫిలింసర్కిల్స్ లో, ఫిలిం నగర్ లో గుసగుసలు మొదలైయ్యాయి. ముగ్గురు టాప్ మోస్ట్ నిర్మాతలు కావడంతో మహర్షి బిజినెస్ విషయంలో ఎవ్వరూ కాంప్రమైజ్ కావడం లేదంటున్నారు. ఏ నిర్మాత డెసిషన్ తీసుకోవాలన్న మిగతా ఇద్దరినీ కనుక్కుని తీసుకోవాల్సి రావడం, ఒక నిర్మాతకి నచ్చిన డీల్ ఇద్దరు నిర్మాతలకు నచ్చకపోవడం వంటివి జరుగుతున్నాయట.

దిల్ రాజు చెబితే నో అంటున్న ఇద్దరు…

ఇంతకుముందు మహర్షి హిందీ హక్కుల విషయంలో ఇలానే దిల్ రాజు డీల్ కి పీవీపీ, అశ్వినీదత్ లు అడ్డు చెప్పారని… తాజాగా మహర్షి ఓవర్సీస్ హక్కుల విషయంలో సేమ్ సీన్ రిపీట్ అవుతుందంటున్నారు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ఒకరు మహర్షి కోసం ఇచ్చిన 16 కోట్ల ఆఫర్ దిల్ రాజుకు నచ్చినా మిగతా ఇద్దరికి నచ్చకపోవడంతో నో చెప్పాల్సి వచ్చిందని… ఏప్రిల్ లో విడుదలయ్యే సినిమాకి ఇప్పటినుండే ఓవర్సీస్ హక్కులను అమ్మడం ఎందుకు ఇంకాస్త ఆగితే మరింత రేటు వస్తుందని.. అశ్వినీదత్, పీవీపీలు చెబుతున్నారట. ఇక మహర్షి బిజినెస్ విషయంలో దిల్ రాజు ఏది చేసినా మిగతా ఇద్దరు నో చెబుతున్నారని టాక్ మాత్రం ఫిలింసర్కిల్స్ లో నడుస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*