`గీత గోవిందం`లో ఆ హాట్ ముద్దు తీసేశారా?

ఈ మ‌ధ్య తెలుగు సినిమాల్లో ముద్దు స‌న్నివేశాలు కామ‌న్ అయిపోయాయి. యూత్‌ని థియేట‌ర్‌ోకి ర‌ప్పించ‌డంలో కిస్సింగులు కీల‌కమ‌నే విష‌యాన్ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు బాగా గుర్తించిన‌ట్టున్నారు. దీంతో ఏమాత్రం అవ‌కాశం ఉన్నా వాటిని సినిమాల్లో చూపించేస్తున్నారు. తెలుగు సినిమాల ముద్దుల గురించి మాట్లాడితే మొద‌ట గుర్తుకొచ్చేది `అర్జున్‌రెడ్డి`నే. అంత‌కుముందు చాలా సినిమాల్లోనూ, ఆ త‌ర్వాత వచ్చిన సినిమాల్లోనూ ముద్దులున్నాయి కానీ… `అర్జున్‌రెడ్డి`లో ఉన్న‌న్ని ముద్దులు మాత్రం వేరే చిత్రాల్లో లేవు. ఆ చిత్రం నుంచి విజ‌య్ దేవ‌ర‌కొండ ముద్దుల స్పెష‌లిస్టుగా మారిపోయాడ‌నే చెప్పాలి. దాంతో విజ‌య్ అన‌గానే ముద్దులుంటాయేమో అని ఊహిస్తారు.

రష్మిక కోరిక మేరకే…!

ఆ విష‌యంలో డిజ‌ప్పాయింట్ చేయ‌కూడద‌నుకున్నారో ఏమో… ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ క‌థ‌తో రూపొందిన `గీత గోవిందం`లోనూ ముద్దు ప్లాన్ చేశారు. నిజానికి ఇది ముద్దు చుట్టూ తిరిగే క‌థే. బ‌స్సులో ముద్దు గురించే గొడ‌వంతా. అయితే అంత‌టితో వ‌దిలిపెట్ట‌లేదు. సినిమా క్లైమాక్స్‌ లో కూడా ఓ మంచి ముద్దు స‌న్నివేశం షూట్ చేశారు. అది చాలా హాట్ ముద్దు. ఒక‌రిపై మ‌రొక‌రు కూర్చుని ముద్దు పెట్టుకుంటారు. సినిమాలో మాత్రం దాన్ని చూపించ‌లేదు. ఇద్ద‌రూ ముద్దు కోసం ద‌గ్గ‌ర‌వ‌డంతో టైటిల్ కార్డ్స్ ప‌డిపోతుంటాయి. కావాల‌నే ఆ కిస్ సీన్ క‌ట్ చేశార‌ని… `గీత గోవిందం` రిలీజ్‌కి కొన్ని రోజుల ముందే ర‌ష్మిక పెళ్లిపై పుకార్లు రావ‌డంతోనే అలా చేశార‌ని టాలీవుడ్ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి. ర‌ష్మిక కోరిక మేరకే ఆ ముద్దుని అలా ఆపేశార‌ని తెలిసింది. సినిమా రిలీజ్‌కి ముందే లీక్ అయిన విష‌యం తెలిసిందే. లీకైన వెర్ష‌న్‌లో విజ‌య్‌, ర‌ష్మిక‌ల మ‌ధ్య కిస్సింగ్ సీన్ ఉంద‌ట‌. అదీ మ్యాట‌రు..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1