హరీష్ శంకర్ చేసిన పనికి ఫీల్ అయ్యారా..?

harish shankar upset raviteja

డైరెక్టర్ హరీష్ శంకర్… దువ్వాడ జగన్నాథం సినిమా తరువాత ఇంతవరకు తన నెక్స్ట్ మూవీని ప్రకటించలేదు. ఆ మధ్య ‘దాగుడు మూతలు’ అనే టైటిల్ తో ఓ మల్టీ స్టారర్ ను రూపొందించాలని చూశాడు కానీ ఆ సినిమాను నిర్మించడానికి నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో అది సెట్స్ మీదకు వెళ్లకుండా ఆగిపోయింది. అయితే రూట్ మర్చి తమిళంలో హిట్ అయిన ‘జిగర్తాండ’ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయాలని చూస్తున్నాడు ప్రస్తుతం.

చెప్పకుండానే యాక్టర్లు ఛేంజ్

దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. సిద్ధార్థ్ పాత్ర కోసం సాయిధరమ్ తేజ్ ను.. నెగెటివ్ షేడ్స్ తో కూడిన బాబీ సింహా పాత్ర కోసం రవితేజను తీసుకుందామని వారిని సంప్రదిస్తే వెంటనే ఓకే చేసారంట. మరి హరీష్ శంకర్ ఏమనుకున్నాడో ఏమో కానీ వీరు కాదని వరుణ్ తేజ్, నాగ శౌర్యలని ఓకే చేసి వారితో సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నాడట. అయితే తమకు ఒక్క మాట కూడా చెప్పకుండా హరీష్ శంకర్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడంతో.. సాయి ధరమ్ తేజ్, రవితేజ ఫీల్ అయినట్టు ఫిలింనగర్ సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*