భారీ లాస్ దిశగా ‘అంతరిక్షం’..!

hug loss for antariksham

క్రిష్ జాగర్లమూడి మంచి డైరెక్టరే కాదు మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ అని కూడా అందరికీ తెలిసిందే. ‘కంచె’, ‘శాతకర్ణి’ లాంటి సినిమాలన్నీ డైరెక్ట్ చేయడమే కాదు ప్రొడ్యూస్ కూడా చేశాడు క్రిష్. ఆ హీరోలకి ఉన్న మార్కెట్ కి మించి బడ్జెట్ పెట్టిన క్రిష్ కొంచెం సాహసమే చేశాడని చెప్పాలి. అయితే ఈసారి తను డైరెక్ట్ చేయకుండా ఓ యంగ్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి ఇష్టపడి ప్రొడ్యూస్ చేసాడు. ‘ఘాజీ’ దర్శకుడు సంకల్ప్ రెడ్డితో ‘అంతరిక్షం’ తీశాడు. ఆ దర్శకుడిని నమ్మి తను చెప్పిన స్టోరీకి కనెక్ట్ అయ్యి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. అలానే వరుణ్ తేజ్ ని కూడా నమ్మి బడ్జెట్ ఎక్కువ పెట్టాడు. వరుణ్ తేజ్ మార్కెట్ స్థాయికి మించే ఖర్చు చేశారు. ఈ సినిమాకు బడ్జెట్ రూ.25 కోట్ల దాకా అయినట్లు సమాచారం. థియేట్రికల్ బిజినెస్ అయితే అనుకున్న స్థాయిలో జరిగింది కానీ టాకే తేడా కొట్టింది.

మరో 15 కోట్లు వస్తేనే..!

భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. టాక్ ఓ మోస్తరుగా ఉండగా.. వసూళ్లు అనుకున్న స్థాయిలో లేవు. మొదటి వీకెండ్ ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.4.5 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. ఫుల్ రన్ లో 10 కోట్ల షేర్ రావడం కూడా కష్టమే అంటున్నారు ట్రేడ్ నిపుణులు. శాటిలైట్, డిజిటల్ హక్కుల రూపంలో ఓ ఐదు కోట్ల వస్తాయనుకున్నా.. సేఫ్ జోన్ లోకి వెళ్లాలంటే 15 కోట్లు వరకు రావాలి. కానీ అవి వచ్చే సూచనలు కనిపించడం లేదు. పెట్టుబడిలో సగం కూడా వెనక్కి వచ్చే అవకాశం లేదు కాబట్టి దీన్ని డిజాస్టర్ కిందే తీసుకోవాలని అంటున్నారు ట్రేడ్ నిపుణులు. ‘అంతరిక్షం’తో రిలీజ్ అయిన సినిమాల్లో కన్నడ డబ్ మూవీ ‘కేజీయఫ్’ ఒక్కటే బాగా ఆడుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*