మహర్షి నుండి ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్!

maharshi movie leak

వంశీ పైడిపల్లి – మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం `మహర్షి`. రీసెంట్ గా ఈ చిత్రం అమెరికాలో దాదాపు 40 రోజుల పాటు షూటింగ్ జరుపుకుని తిరిగి ఇండియాకి వచ్చిందని తెలుస్తుంది. నెక్స్ట్ షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో నవంబర్ రెండో వారం నుండి స్టార్ట్ కానుంది. ఈ షెడ్యూల్ కోసం టీం మొత్తం రెడీ అవుతుంది. ఇది ఇలా ఉండగా అమెరికాలో జరిగిన భారీ షెడ్యూల్ లో పూజ హెగ్డే పాల్గొనలేదని తెలుస్తుంది. సాధారణంగా పూజ ఏ సినిమా చేస్తున్నా ఆ లొకేషన్ నుండి ఫొటోస్ తీసి తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేస్తూ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఆలా చేయలేదు.

రైతు పాత్రలోనూ కనిపిస్తాడా..?

‘మహర్షి’ గోవా షెడ్యూల్ నుంచి కొన్ని ఫోటోల్ని షేర్ చేసింది. తరువాత ప్రభాస్ – రాధాకృష్ణ సినిమా ఇటలీలో జరుగుతుంటే అక్కడ నుండి కూడా ఫొటోస్ పెట్టింది. ‘అరవింద సమేత’ టైంలో కూడా చాలాసార్లు లొకేషన్ నుండి ఫొటోస్ పెట్టేది. కానీ ఈసారి ‘మహర్షి’ అమెరికా షెడ్యూల్ కి సంబంధించి ఒక్క ఫోటో కూడా షేర్ చేయలేదు. దీంతో పూజ ఈ షెడ్యూల్ లో పాల్గొనలేదని భావించవచ్చు. మరోపక్క ఈ సినిమాలో మహేష్ ఐటీ కంపెనీకి ఓనర్ గా, రైతు పాత్రలో కనిపిస్తారని ప్రచారం సాగింది. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ఓనర్ గా మహేష్ కు సంబంధించిన సీన్స్ అమెరికాలో షూట్ చేశారట. రామోజీ ఫిలిం సిటీలో జరిగే షెడ్యూల్ లో మహేష్ ని రైతు పాత్రలో చూపించనున్నాడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. మహేష్ కి స్నేహితుడుగా అల్లరి నరేష్ నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అవబోతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*