టాలీవుడ్ హీరోలు మణికి ‘నో’ చెపుతున్నారా..?

maniratnam dream movie

మణిరత్నం డైరెక్షన్ లో ఎవరికి సినిమా చేయాలని ఉండదు చెప్పండి! ఆయన డైరెక్షన్ లో హీరోగా సినిమా చేయాలంటే పెట్టి పుట్టాలి. అటువంటి అదృష్టం ఎప్పుడో ఒక్కసారి వస్తుంది. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు మణిరత్నం పరిస్థితి వేరు. ఆయన డైరెక్షన్ సినిమా చేయాలంటే భయపడే దగ్గరకు వచ్చింది మణి పరిస్థితి. మణిరత్నంను ఆహా ఓహో అంటూ భ‌జ‌న చేసిన చాలామంది హీరోస్ ఆయన డైరెక్షన్ లో సినిమా అంటే నో అని చెప్పేస్తున్నారు. ఆయన గ్రాఫ్ అంతలా పడిపోయింది. తెలుగులో ఆయన ఎప్పటినుండో ఓ సినిమా చేద్దామ‌ని అనుకుంటున్నారు కానీ కుదరట్లేదు. అయితే రీసెంట్ గా ఆయనకి ఓ కథ దొరకడంతో ఆ కథ కోసం హీరోలని వెతికే పనిలో ఉన్నాడు.

ఛాన్స్ ఇవ్వని తెలుగు హీరోలు

ఈ కథ ముందు విజ‌య్ దేవ‌ర‌కొండ ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. విజ‌య్ ఈ సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాడు కూడా. మరి ఏమైందో ఏంటో సడన్ గా డ్రాప్ అయ్యాడు విజయ్. విజయ్ తరువాత ఆ కథ వెంటనే నాని వద్దకు వెళ్లింది. నేను మణిరత్నం వీర అభిమాని అని చెప్పుకునే నాని కథ విన్న తరువాత ఏమీ స్పందించ‌లేదంట‌. ఇప్పుడు ఆ కథ యంగ్ హీరో శ‌ర్వానంద్ వ‌ర‌కూ వెళ్లింది. శర్వా కూడా ఏమీ ఆలోచించకుండా ‘నో’ అనేశాడ‌ట‌. అయినా స‌రే.. మ‌ణిర‌త్నం త‌న ప్ర‌యత్నాలు ఆప‌డం లేద‌ని తెలుస్తోంది. కథనే నమ్ముకునే మణి కొత్త వాళ్లతో ఈ సినిమా చేద్దామ‌ని ఫిక్స్ అయ్యిపోయాడట. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో ఉంటుందో ఏంటో తెలియాల్సి ఉంది. ఏదేమైనా మణిరత్నంకి ఇటువంటివి ఎదురు అవ్వడం దురదృష్టకరం.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*