మెహ్రీన్ ఛాన్స్ సోనాల్ కొట్టేసిందా..?

complaint on mehreen

క్యూట్ గా, బబ్లీగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ కౌర్ చెప్పానా.. నేను చెప్పానా అంటూ మొదటి సినిమాకే ఆకట్టుకుంది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ చూసిన ఎవ్వరైనా మెహ్రీన్ టాప్ హీరోయిన్ అవుతుందనే అనుకున్నారు. కానీ టాప్ స్టార్స్ తో మాత్రం మెహ్రీన్ కౌర్ కి అవకాశాలు రానే లేదు. మీడియం రేంజ్ హీరోలతోనే సరిపెట్టుకుంటున్న మెహ్రీన్ మధ్యలో అధిక బరువుతో అవకాశాలు కోల్పోయింది. తొలిప్రేమ లాంటి సినిమాలో మెహ్రీన్ అధిక బరువు కారణంగానే అవకాశం కోల్పోయింది. ప్రస్తుతం వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్ 2, బెల్లంకొండ శ్రీనివాస్ తో కవచం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేస్తున్న మెహ్రీన్ కౌర్ టాలీవుడ్ టాప్ స్టార్ పక్కన అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిందనే టాక్ ఫిలింనగర్ లో నడుస్తుంది.

డేట్స్ కుదరకపోవడంతో…

మరి ఆ చేజారిన ఛాన్స్ అలాంటి ఇలాంటిది కాదండోయ్… ఏకంగా సూపర్ స్టార్ మహేష్ పక్కన ఛాన్స్ మిస్ చేసుకుందట. అయితే ఈ అవకాశాన్ని మెహ్రీన్ కావాలనే చేజార్చుకుందంటున్నారు. మహేష్ తాజా చిత్రం మహర్షిలో మొదటగా సెకండ్ హీరోయిన్ ఆఫర్ వచ్చిందట. ఆ ఆఫర్ వచ్చినప్పుడు మేహ్రిన్ ఎగిరి గెంతేసినా… మహర్షి కోసం వంశీ పైడిపల్లి డేట్స్ అడిగినప్పుడు మాత్రం మెహ్రీన్ వేరే సినిమాలతో బిజీగా ఉండి కుదరలేదట. అందుకే మహేష్ బాబు పక్కన నటించే గోల్డెన్ ఆఫర్ ని మెహ్రీన్ రిజెక్ట్ చెసిందట. మరి మెహ్రీన్ కి వద్దన్నా ఆ గోల్డెన్ ఛాన్స్ ని బాలయ్య హీరోయిన్ సోనాల్ చౌహాన్ తన్నుకుపోయింది. మహర్షి లో మెయిన్ హీరోయిన్ పూజ హెగ్డే కాగా… ఇప్పుడు సెకండ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ అన్నమాట. మరి సోనాల్ కి పెద్దగా టాలీవుడ్ లో హిట్స్ అయితే లేవు. కానీ మెహ్రీన్ వద్దనేసరికి వంశి కి సోనాల్ తప్ప మరో ఆప్షన్ లేకపోవడంతోనే మహర్షి కోసం సోనాల్ ఎంపిక జరిగిందట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*