మెహ్రీన్ ఆ సినిమా నుండి తప్పుకుంది..!

‘విజేత’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్ రెండో సినిమా కోసం రెడీ అవుతున్నాడు. పులి వాసు అనే యంగ్ డైరెక్టర్ డైరెక్షన్ లో కళ్యాణ్ ఈ సినిమా చేస్తున్నాడు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా పనులు చకచకా జరిగిపోతున్నాయి. మొదట ఈ సినిమాలో సుధీర్ బాబు చేయాల్సి ఉంది ఆయనకి జోడిగా మెహ్రీన్ అని కూడా అనుకున్నారు. ఇద్దరికీ అడ్వాన్స్ కూడా ఇచ్చారంట. మరి ఏమైందో ఏంటో తెలియదు కానీ ఈ ప్రాజెక్ట్ నుండి సుధీర్ బాబు తప్పుకోవడంతో కళ్యాణ్ దేవ్ ఎంటర్ అయ్యాడు. సుధీర్ బాబు తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేసాడని తెలుస్తుంది.

బిజీగా ఉన్నందునే..!

అయితే తాజా సమాచారం ప్రకారం హీరోయిన్ మెహ్రీన్ కూడా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి మెహ్రీన్ ఎందుకు తప్పుకుందో మాత్రం ఎవరికీ అర్ధం కావట్లేదు. ఆమెకు ఏదో పెద్ద ఆఫర్ వచ్చిందని… అందుకే తప్పుకుందని అంటున్నారు. ప్రస్తుతం ఈమె వరుణ్ తేజ్ – వెంకటేష్ నటిస్తున్న ‘ఎఫ్ 2’ లో నటిస్తుంది. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఈ సినిమా కాకుండా తెలుగులో రెండు సినిమాలు, కోలీవుడ్ లో రెండు సినిమాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.

Sandeep
About Sandeep 5624 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*