‘మిస్టర్ మజ్ను’ ఆ… సినిమా కాపీనా..?

mr majnu story copied

అక్కినేని అఖిల్ రెండు డిజాస్టర్స్ తరువాత వెంకీ అట్లూరి మీదే ఆశలు పెట్టుకుని ‘మిస్టర్ మజ్ను’ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా రెండు నెలల్లో రిలీజ్ కానుంది. ఇందులో అఖిల్ ప్లేబాయ్ పాత్రలో నటిస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన టీజర్, సాంగ్స్ చూస్తే ఈ విషయం అర్ధం అవుతుంది. ఎటువంటి హడావిడి లేకుండా ఈ సినిమాను స్టార్ట్ చేసేసారు మేకర్స్. ఎక్కడా చప్పుడు కాకుండా ఈ సినిమాను చకచకా ఫినిష్ చేసేసారు. నాగ్ కూడా ఈ సినిమా విషయంలో పెద్దగా ఇంవాల్వ్ కాలేదు. దీంతో కొంతమందికి ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో అనుమానాలు వచ్చాయి. ఇది కాపీ సినిమా అని తెలుస్తుంది. టీజర్ బట్టి.. యూనిట్ సభ్యులు చెబుతున్న ప్రకారం చూస్తుంటే ఇది బాలీవుడ్ లో చాలా ఏళ్ల కిందట వచ్చిన ‘బచ్నా యే హసీనా’ అనే సినిమా నుండి ఇన్స్పైర్ అయ్యి తీస్తున్నట్టు అర్థం అవుతుంది.

అమ్మాయిలను ట్రాప్ చేసే క్యారెక్టర్ లో

‘బచ్నా యే హసీనా’ సినిమా రణబీర్ కపూర్ కెరీర్ ఆరంభంలో వచ్చింది. ఇందులో రణబీర్ ప్లేబాయ్‌గా కనిపిస్తాడు. దీపికా పదుకొనే, బిపాసా బసు హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో రణబీర్ అమ్మాయిలని ట్రాప్ చేస్తుంటాడు. చివరికి అతడికి హీరోయిన్ నుంచి షాకులు తగులుతాయి. ఈ క్రమంలో అతడు మంచి వాడిలా మారిపోతాడు. ఈ లైనే ‘మిస్టర్ మజ్ను’ కోసం వెంకీ తీసుకుని డెవలప్ చేసాడని సమాచారం. ‘బచ్నా యే హసీనా’ బాలీవుడ్ లో యావరేజ్ గా ఆడింది. మరి ‘మిస్టర్ మజ్ను’ అంతకు మించి ఆడుతుందా..? అంటే కొన్ని రోజుల వరకు ఆగాల్సిందే. ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఒకవేళ సేమ్ లైన్ తీసుకుంటే వారి నుండి రీమేక్ రైట్స్ తీసుకున్నారో లేదో తెలియాలి. కానీ అఖిల్ కు ఈ సినిమా హిట్ అవ్వడం చాలా అవసరం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*