‘ఎన్టీఆర్’ లో నాగబాబు..?

నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’ బయోపిక్. ఈ సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఒకపక్క ఇందులో క్యాస్టింగ్ మరోపక్క ఈ సినిమా ఫస్ట్ లుక్స్ ఈ మూవీని తారస్థాయికి తీసుకెళ్తుంది. రీసెంట్ గా హరికృష్ణ అకాల మరణంతో షూటింగ్ కి బ్రేక్ వచ్చినప్పటికీ ఈ రోజు నుంచి కంటిన్యూ చేయబోతున్నారు. సంక్రాంతికి టార్గెట్ పెట్టుకుని షూటింగ్ ను ఫుల్ స్పీడ్ తో జరుపుతున్నారు.

మళ్లీ మోహన్ బాబు వద్దని…

అయితే క్రిష్ తో పాటు బాలకృష్ణ సైతం ఆర్టిస్టుల విషయంలో కాంప్రమైజ్ కావడం లేదట. తాజాగా ఎస్వి రంగారావు పాత్ర కోసం మెగా బ్రదర్ నాగబాబుని కలిశాడట క్రిష్. ‘మహానటి’ సినిమాలో ఎస్వీ రంగారావు పాత్ర మోహన్ బాబు చేసిన సంగతి తెలిసిందే. మళ్లీ మోహన్ బాబుతో చేయిస్తే ప్రేక్షకులు పోలికలు చూస్తారని అందుకే కొత్త మొహం అయితే బాగుంటుందని నాగబాబును సెట్ చేసుకున్నట్టు టాక్. ఆ పాత్రకు నాగబాబు కరెక్ట్ గా సూట్ అవుతారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. మరి ఎస్వీ రంగారావు పాత్ర చేసేందుకు నాగబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాలి. ఇన్సైడ్ టాక్ ప్రకారం నాగబాబు ఆ పాత్ర చేయడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.

అసెంబ్లీ సీన్ల చిత్రీకరణ…

ఇక ఈరోజు నుండి ఎన్టీఆర్ మొదటిసారి టిడిపి అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో మాట్లాడే సన్నివేశాలు షూట్ చేయబోతున్నట్టు తెలిసింది. ఇదే షెడ్యూల్ లో నారా చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్న రానా కూడా నటించనున్నాడు. ప్రస్తుతం నాగబాబు  జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేతలో నటిస్తూనే మరోవైపు బాబాయ్ ఎన్టీఆర్ లో చేయనున్నాడు.