జెర్సీకి నాని చేసేది కరెక్టేనా..?

nani remunaration in jercy

నానికి కెరీర్ పరంగా మంచి సినిమాలే ఉన్నప్పటికీ ఈ మధ్య ఎందుకనో అతని సినిమాలు ఆడడం లేదు. అయితే రీసెంట్ గా హీరో నాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ‘జెర్సీ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రేపు న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ అవుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. తాజా ఫిలింనగర్ సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం నాని రెమ్యూనరేషన్ తీసుకోట్లేదట. అవును నిజమే. రెమ్యూనరేషన్ కి బదలు స్టార్ హీరోస్ లాగా ఏదో ఒక ఏరియా రైట్స్ తీసుకోవాలని నాని నిర్ణయించుకున్నాడట.

రాధాకృష్ణ ఒప్పుకోరుగా మరి…

ఈ డీల్ సినిమాకి ముందే జరిగిందని తెలుస్తుంది. నిజానికి సితార ఎంటర్టైన్మెంట్స్, హారిక-హాసిని బ్యానర్స్ ఒక్కటే. ప్రొడ్యూసర్స్ వేరు కావొచ్చు కానీ రెండు బ్యానర్స్ వ్యవహారాలు రాధాకృష్ణనే చూసుకుంటున్నారు. రాధాకృష్ణ హీరోస్ కి ఏరియా రైట్స్ ఇవ్వడానికి ఇష్టపడడు. అంత అవసరం అయితే ఆ హీరోకి కోటి రూపాయలు ఎక్కువ ఇవ్వటానికి ఇష్టపడతాడు కానీ బిజినెస్ పార్టనర్ గా మాత్రం ఎవరినీ తీసుకోరు. కానీ వినిపిస్తున్న పుకార్ల ప్రకారం.. నాని కూడా ఇందులో వాటాదారు అనే వాదన వినిపిస్తోంది. చిన్న హీరోల సినిమాలకి ఏరియా వైజ్ వచ్చే డబ్బు చాలా తక్కువ. అందులో నానికి ఇవ్వాలంటే ప్రొడ్యూసర్స్ కి ఏమి మిగులుతుంది..?

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*