‘ఎన్టీఆర్’ లో అనుష్క పాత్ర ఆమెదేనా..?

anushka remunaration

‘ఎన్టీఆర్’ బయోపిక్ నుండి రోజుకో అప్ డేట్ వ‌స్తోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ గా నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ఈ చిత్రం నుండి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్‌ ఒకటి బయటకి వచ్చి హల్ చల్ చేస్తుంది. ఎన్టీఆర్ తో పలు సినిమాల్లో నటించి మెప్పించిన అలనాటి హీరోయిన్ బి.సరోజా దేవి పాత్రలో అనుష్క నటించబోతుందని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఇది నిజమే అంటున్నారు కొంతమంది యూనిట్ సభ్యులు.

త్వ‌ర‌లోనే షూటింగ్‌…

ఎన్టీఆర్ – బి. సరోజా దేవి కలిసి చాలా సినిమాల్లో నటించారు. అందులో చాలావరకు సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. ఆ చిత్రాలకు సంబంధించిన షూటింగ్ సంఘటనలను ఈ బయోపిక్ లో చూపించనున్నారు క్రిష్. త్వరలోనే జరగబోయే కొత్త షెడ్యూల్ లో అనుష్క శెట్టి పాల్గొననుందని..ఆమెపై చిత్రబృందం ఆ సన్నివేశాల తాలూకు సీన్స్ ను చిత్రీకరించనున్నారని సమాచారం. త్వరలోనే దీనిపై ఓ అప్ డేట్ కూడా రానుంది. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జనవరి 9న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ను విడుదల చేసి, జనవరి 24న రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*