ఎన్టీఆర్ హీరోగా… చరణ్ నిర్మాతగా సినిమా..?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య స్నేహపూర్వక వాతావరణం వెల్లువిరుస్తుంది. స్టార్ హీరోలు మాత్రమే కాదు యంగ్ హీరోలు కూడా మిగతా హీరోలతో ఫ్రెండ్ షిప్ మెయింటింగ్ చేస్తున్నారు. ఇక అభిమానులు కూడా హీరోలు కలిసుంటే తమకి హ్యాపీనే అని చెప్పకనే చెబుతున్నారు. అయితే ఈ మధ్యన రామ్ చరణ్, ఎన్టీఆర్ ల స్నేహం బాగా ముదిరింది. ఎప్పటినుండో ఫ్రెండ్స్ అయిన వీరు ఈ మధ్య తరుచు కలుస్తున్నారు. తమ భార్యలతో పాటు కొన్ని స్పెషల్ అకేషన్స్ ని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఇద్దరు కలిసి రాజమౌళి సినిమాలో నటిస్తున్నారు. అందుకే వీరి మధ్యన స్నేహం మరింతగా బలపడిందని చెబుతున్నారు.

ఇద్దరూ బిజిగానే…

తాజాగా వీరి స్నేహంపై ఒక బిగ్ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే రామ్ చరణ్ హీరోగానే కాకుండా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ని స్థాపించి సినిమాల నిర్మాణం కూడా చేపడుతున్నాడు. ప్రస్తుతం తండ్రి చిరుతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న రామ్ చరణ్ తాజాగా ఎన్టీఆర్ సినిమాని తన బ్యానర్లో నిర్మించబోతున్నాడనే న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో తెగ స్ప్రెడ్ అయ్యింది. మరి రూమర్ కాకపోతే.. ప్రస్తుతం అరవింద సమేత చేస్తున్న ఎన్టీఆర్ రాజమౌళి మల్టీస్టారర్ కోసం రెండేళ్లు కేటాయించాలి. మరోపక్క తండ్రి చిరు సైరా నరసింహారెడ్డి అనే బిగ్ ప్రాజెక్ట్ ని నిర్మాతగా హ్యాండిల్ చేస్తున్నాడు రామ్ చరణ్.

వారు స్పందిస్తేనే తెలిసేది…

బోయపాటి సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇక రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం తండ్రితో మాత్రమే సినిమాలు చేస్తున్న రామ్ చరణ్.. ఇక మీదట బయట హీరోలతో సినిమాలు చెయ్యాలనుకుంటున్నాడట. అందులో తప్పేం లేదుగాని… అప్పుడే ఎన్టీఆర్ తో చరణ్ సినిమా అంటే అది ఇప్పట్లో కుదిరే పని కాదు. మరి మెగా బ్యానర్ లో ఎన్టీఆర్ సినిమా చేసేందుకు రంగం సిద్ధం అవుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతుందో కానీ రామ్ చరణ్ గానీ.. ఎన్టీఆర్ గాని స్పందించేవరకు ఇది కేవలం రూమర్ గానే మిగిలిపోక తప్పేలా లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*