ప్రభాస్ సినిమాకి అక్కినేని సినిమాతో పోలిక!

prabhas comments on rajamouli

అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి నటించిన మనం సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులనే కాదు… ప్రేక్షకులను కూడా మైమరపించింది. అక్కినేని నాగేశ్వర రావు మరణం తర్వాత అయన నటించిన ఆఖరి సినిమాగా మనం సినిమా అక్కినేని ఫ్యామిలీ కి స్వీట్ మెమొరిగా గుర్తుండిపోయింది. మనం మంచి క్లాసికల్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో చైతు స్టూడెంట్ గా, నాగార్జున బిజినెస్ మ్యాన్ గా నటించారు. ఈ సినిమాలో నాగార్జున శ్రీమంతుడిగా, పాత కార్లను ఇష్టపడే వ్యక్తిగా కనిపిస్తాడు. అయితే తాజాగా ప్రభాస్ – రాధాకృష్ణ సినిమాలో ప్రభాస్ కూడా అగర్బ శ్రీమంతుడిగా.. పాత కార్లను ఇష్టపడే వ్యక్తిగా ఒక సాధారణ అమ్మాయితో ప్రేమలో పడినపుడు ఎదురైన సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సంఘటనలన్నీ మనం సినిమాలో నాగార్జున చేసిన లాంటివే. మరి జిల్ రాధాకృష్ణ మనం సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి ప్రభాస్ సినిమా కథ రాశాడో లేదా అనేది మాత్రం క్లారిటీ లేదు.

పల్లెటూరి నేపథ్యంలో…

కానీ ప్రభాస్ సినిమా 1960 పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కడం… ప్రభాస్ శ్రీమంతుడిగా పాత అంటే వింటేజ్ కార్లను ఇష్టపడే వ్యక్తిగా కనిపిస్తాడని చెప్పగానే అందరూ నాగార్జున మనం సినిమా కథను ప్రభాస్ కొత్త చిత్రంతో పోలిక పెట్టేస్తున్నారు. మరి ఇదే కథతో రెండు మూడు భాషల్లో సినిమా చేస్తే అది అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందా లేదా అనేది మాత్రం ఆలోచించాల్సిన విషయం. అసలు ప్రభాస్ బాహుబలి తర్వాత ఆ రేంజ్ కథలతోనే సినిమాలు చెయ్యాలని డిసైడ్ అయ్యాడనే విషయం అతను చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రాలు చూస్తుంటే తెలుస్తుంది. చూద్దాం ప్రభాస్ కొత్త సినిమా, మనం సినిమా ఒకే మాదిరిగా ఉంటాయా లేదా అనేది 2020కి కానీ క్లారిటీ రాదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*