దేవిశ్రీ ని వద్దన్న రామ్ చరణ్..?

Charan said no to devisri prasad

ఇప్పటివరకు పరాజయం ఎరుగని కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. శివ చెప్పిన లైన్ కు చిరు ఇంప్రెస్స్ అవ్వడంతో రామ్ చరణ్ ఈ సినిమాను తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. రీసెంట్ గా కొరటాల కథ చర్చల్లో ఉన్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీని తీసుకుందాం అని డిసైడ్ అయ్యాడట. కొరటాల చేసిన సినిమాలన్నిటికీ దేవిశ్రీ ప్రసాదే మ్యూజిక్ అందించాడు. చిరు – దేవి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాల్లో సూపర్ హిట్ అయ్యాయి. అందుకే మరోసారి ఆ కాంబినేషన్ ను రిపీట్ చేస్తున్నాడు శివ.

వద్దని చెప్పిన చరణ్…

అయితే శివ నిర్ణయానికి చరణ్ నో చెప్పాడట. చిరు సినిమాకు దేవిశ్రీ వద్దని చరణ్ భావిస్తున్నాడట. దేవి కి బదులు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేదిని పెట్టుకుందాం అని కొరటాల శివకి చెప్పాడట. అమిత్ త్రివేది ప్రస్తుతం తెలుగులో చిరంజీవి హీరోగా వస్తున్న “సైరా” సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పుడు చిరు – కొరటాల సినిమాకి కూడా అతనే మ్యూజిక్ అందించనున్నాడని సమాచారం. త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*