రెడ్డిని నమ్మి.. స్వేచ్ఛనిచ్చాడు..!

రామ్ చరణ్ స్టార్ హీరోగా మరోపక్క నిర్మాతగా దూసుకుపోతున్నాడు. ధృవ, రంగస్థలం హిట్స్ తో ఇప్పుడు బోయపాటి తో మాస్ ఎంటర్టైన్మెంట్ లో నటిస్తున్నాడు. ఇక నిర్మాతగా ఖైదీ నెంబర్ 150 తర్వాత భారీ బడ్జెట్ తో సై రా నరసింహరెడ్డి సినిమా చేస్తున్నాడు. తన తండ్రి తో వరసగా భారీగా సినిమాలు నిర్మిస్తున్న రామ్ చరణ్ ఇప్పుడు సై రా సినిమాని సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో నిర్మిస్తున్నాడు. చరిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ని రామ్ చరణ్ దర్శకుడు సురేందర్ రెడ్డికి ఎటువంటి ఆంక్షలు విధించడం లేదట. ద‌ర్శకత్వంలో స్వేచ్ఛనివ్వడంతో పాటుగా..బడ్జెట్ పరంగా ఎలాంటి లిమిట్స్ పెట్టకుండా.. అలాగే సినిమా ఈ టైం కల్లా పూర్తి కావాలనే ఆంక్షలు విధించకుండా రెడ్డిని బాగా నమ్మి అతనికి రామ్ చరణ్ పూర్తి స్వేచ్ఛనిచ్చాడని ఫిల్మనగర్ టాక్. వేస్ట్ గా మనీ పెట్టకుండా కావాల్సిన దానికి ఖర్చు పెడుతూ…ఎంత కావాలంటే అంత ఖర్చు పెడతానని సురేందర్ రెడ్డికి హామీ కూడా ఇచ్చాడట. అనుకున్నట్టుగానే ఏ సీన్ కి ఎంత బడ్జెట్ కేటాయించాలి అనేది రామ్ చరణ్ పక్క ప్లానింగ్ తో ఉంటున్నది.

హీరోగా అన్నీ తెలుసు కాబట్టి…

హీరోగా బయటి నిర్మతల‌తో చేసే రామ్ చరణ్ ఇప్పుడు తానే నిర్మాతగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు. ఇక నిర్మాతలకు ఉండే లోటుపాట్లు, కష్టసుఖాలు రామ్ చరణ్ కి తెలుగు కాబట్టే సురేందర్ రెడ్డి విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని అతనికి పూర్తి స్వేచ్ఛనిచ్చాడంటున్నారు. ఇక చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కాబట్టి… దర్శకుడిని హడావిడి పెడితే సినిమా క్వాలిటీలో తేడా రావడం, బడ్జెట్ లిమిట్ పెడితే సినిమాలో ఉన్న రిచ్ నెస్ పోతుందని.. అలాగే సినిమాకి డెడ్ లైన్ పెట్టి పూర్తి చెయ్యమంటే సినిమా విషయంలో తేడా కొడుతుందని.. అన్ని బాగా ఆలోచించే సురేందర్ రెడ్డిపై రామ్ చరణ్ ఒత్తిడి లేకుండా చూసుకుంటున్నాడట. ఇక సై రా నరసింహారెడ్డి ఇండియా వైడ్ గా పలు భాషల్లో తెరకెక్కుతుంది కనుక క్వాలిటీ విషయంలో చరణ్ రాజీపడడం లేదట. అదండీ సంగతి.