రానా మళ్లీ కెలికాడా?

స్టార్ హీరోయిన్ త్రిష ఈ ఏడాది తమిళనాట 96 తో సూపర్ హిట్ కొట్టింది. చాలా రోజుల తర్వాత త్రిష ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇకపోతే త్రిష కి హీరో రానాల మధ్య సం థింగ్ సం థింగ్ అనే ప్రచారం చాలా కాలంగా మీడియాలో నానుతోంది. రానా, త్రిష పర్శనల్ ఫొటోలు కూడా ఒక సింగర్ లీక్ చేస్తే అవి మీడియాలో సంచలనం సృష్టించాయి. ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో.. త్రిషతో డేటింగా.. రానా ఒప్పుకోడు అని అఖిల్ చేసిన కామెంట్స్ కూడా వీరి ఎఫైర్ కు బలం చేకూర్చాయి. అయితే అటు రానా గానీ, ఇటు త్రిష గానీ దీనిపై ఎప్పుడూ నోరు విప్పలేదు. ఖండించలేదు..అలాగని అవును మేము రిలేషన్ లో ఉన్నామని అనలేదు.

అయితే రానా, త్రిష లు సైలెంట్ గానే వుంటున్నారు కాబట్టి ఈ మధ్యకాలంలో వారిపై వార్తలు పెద్దగా వినపడటం లేదు. కానీ మరోసారి వీరిద్దరూ అనుకోకుండా రానా ట్వీట్ తో వార్తల్లోకి వచ్చారు. త్రిషను అభినందిస్తూ రానా దగ్గుబాటి ట్వీట్ చేశాడు. త్రిష కోసం రానా ఎందుకు ట్వీట్ చేసాడంటే… త్రిష సినిమాల్లోకొచ్చి 16 ఇయర్స్ అవడంతో.. త్రిష తనని ఇంతగా అభిమానించిన వారికి కృతఙ్ఞతలు చెబుతూ…మీరు పెడుతున్న చాలా మంచి పోస్టులకు, మెసేజ్‌లకు, వీడియోలకు చాలా థాంక్స్. ది స్వీటెస్ట్ 16 ఇయర్స్. నా ఈ ప్రయాణంలో నాతో ఉన్న మీకంటే నాకు ఇంకా ఎక్కువ ఏం కావాలి అంటూ ట్వీట్ చేస్తే… దానికి రానా రీ ట్వీట్ చేసాడు. అప్పుడే నువ్వు ఇండస్ట్రీకి వచ్చి 16 ఏళ్లు అయిపోయిందా అంటూ త్రిష కి అభినందనలు తెలిపాడు. మరి ఇదంతా చూస్తుంటే రానాకీ త్రిష బాగా దగ్గర అని అనిపించక మానదు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*