డిజాస్టర్ల దెబ్బకు బడ్జెట్ దిగింది

raviteja and mythri movie makers deal telugu post telugu news

ఈ ఏడాది రవితేజ నుండి వరసగా మూడు డిజాస్టర్స్ రావడంతో దర్శకనిర్మాతలు జాగ్రత్త పడుతున్నారు. మొన్నటివరకు మినిమం గ్యారంటీ అన్న విధంగా ఉన్న రవితేజకు ఈ ఏడాది అస్సలు కలిసి రాలేదు. చేసిన మూడు సినిమాలు భారీగా నష్టాలు తెచ్చిపెట్టాయి. మూడు డిజాస్టర్ల ఎఫెక్ట్‌ కారణంగా ఇంతకుముందులా రవితేజని చూసుకుని ఖర్చు పెట్టేయడానికి నిర్మాతలు జంకుతున్నారు.

బడ్జెట్ కూడా తక్కువ చేశారా..?

అయితే ఈసారి రొటీన్ కి భిన్నంగా ఓ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ తో మన ముందుకు రానున్నాడు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ వి.ఐ. ఆనంద్‌ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ మూవీ బడ్జెట్ మొదట 25 కోట్ల వరకు అనుకున్నారు. కానీ రవి చిత్రాలు వరసగా బోల్తాపడంతో ఈసారి బయ్యర్లు పెద్దగా ఆఫర్‌ చేయరని రియలైజ్‌ అయ్యి ఈ చిత్రానికి బడ్జెట్‌ ఇప్పుడు పదిహేను కోట్లకే పరిమితం చేయాలని నిర్మాత రామ్‌ తాళ్ళూరి దర్శకుడికి చెప్పాడని తెలుస్తుంది.

సినిమా క్వాలిటీ తగ్గుతుందా..?

అటు డైరెక్టర్ వి.ఐ. ఆనంద్‌ గత చిత్రం ‘ఒక్క క్షణం’ కూడా డిజాస్టర్ కావడంతో బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాడు నిర్మాత. ఒకేసారి 10 కోట్లు తగ్గిస్తే సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా కాబట్టి క్వాలిటీ ఏమన్నా తగ్గే అవకాశం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇంకా హీరోయిన్ ఫైనల్ అవ్వలేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*