#RRR కథ ఇదేనంట..!

రాజమౌళి – ఎన్టీఆర్ – రామ్ చరణ్ #RRR పై రోజుకో రకమైన న్యూస్ సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాజమౌళి తెరకెక్కించబోయే RRR మల్టీస్టారర్ పై అప్పుడే ట్రేడ్ లో భారీ అంచనాలే మొదలైనాయి. ఇప్పటికే ఎన్టీఆర్, చరణ్ లుక్స్ ని రాజమౌళి ఫైనల్ చేసాడనే టాక్ నడుస్తుంది. ఎన్టీఆర్ విలన్ గా రామ్ చరణ్ హీరోగా ఈ సినిమాలో స్టార్ హీరోలిద్దరూ కనిపిస్తారని న్యూస్ టాప్ ట్రేండింగ్ లోకి వచ్చింది. అయితే అది నిజమా.. కాదా.. అనేది నవంబర్ మొదటి వారంలో క్లారిటీ రావొచ్చు. ఎందుకంటే రాజమౌళి #RRR ని కాస్త ముందుగా నవంబర్ మొదటివారంలోనే ప్రారంభించనున్నాడని తెలుస్తుంది. సినిమాని మొదటి వారంలో మొదలెట్టి నవంబర్ 18 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలెడతాడని అంటున్నారు.

1920ల నాటి కథతో…

అయితే సినిమా ఓపెనింగ్ రోజునే తన సినిమా కథపై క్లారిటీ ఇవ్వడమనేది రాజమౌళికి ఉన్న అలవాటు. అయితే ఈలోపు రాజమౌళి సినిమా కథ బ్యాగ్డ్రాప్ అలా ఉండబోతుంది. ఇలా ఉండబోతుందనే కథనాలు ఉండనే ఉన్నాయి. ప్రస్తుతం RRR పై మరో రూమర్ బయటకొచ్చింది. బయటికొచ్చిన సమాచారం ప్రకారం… రాజమౌళి మళ్లీ భారీ బడ్జెట్ తో భారీ సాహసానికి రెడీ అవుతున్నాడట. ఈసారి రాజమౌళి సినిమా 1920 నేపథ్యాన్ని తీసుకుని స్వాతంత్రం రాకముందు నెలకొన్న పరిస్థితులను ఆధారంగా చేసుకుని సరికొత్త పాయింట్ తో కథను రాసుకున్నట్టుగా చెబుతున్నారు.

భారీ సెట్లు కూడా ఏర్పాటు…

అంతేకాకుండా రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ గెటప్ లు కూడా చాలా భిన్నంగా ఉంటాయని… ఇప్పటికే ఫైనల్ స్కెచ్ లను రాజమౌళి ఓకే చేసాడని టాక్. ఇక ఈ సినిమా కోసమే సిటీ చివరిలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీని రెండేళ్లకు లీజ్ తీసుకుని.. అక్కడ భారీ సెట్స్ నిర్మాణం కూడా రాజమౌళి పూర్తి చేసాడంటున్నారు. అన్నీ పక్కగా సెట్ చేసుకుని రాజమౌళి ఈ సినిమా కోసం రంగంలోకి దిగబోతున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్.. రాజమౌళి సినిమా కోసం కసరత్తులు మొదలుపెడితే… రామ్ చరణ్ కూడా ఫోటో షూట్స్ లో పాల్గొంటున్నాడట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*