మెగా మేనల్లుడు ‘లైపో’ చేయించుకుంటున్నాడా..?

Saidharam tej taking low remunaration

మెగా వారసులందరిలో ఎక్కువ లావుగా ఉన్న వారసుడు సాయి ధరమ్ తేజ్. తేజ్ సినిమాల్లోకి రాకమునుపు ఎక్కువ బరువుతో ఉండేవాడు. అయితే సినిమాలే లక్ష్యంగా హీరోగా మారే నాటికల్లా.. సాయి ధరమ్ తేజ్ బాగా బరువు తగ్గి ఫిట్ గా తయారయ్యాడు. ఈ విషయం సాయి ధరమ్ పలు సినిమా ఇంటర్వూస్ లో చెప్పాడు. అయితే ఎప్పుడూ ఫిట్ గా ఉండే సాయి ధరమ్ ఈ మధ్యన మళ్లీ ఒళ్ళు చేసాడు. తన సినిమాల వరస వైఫల్యాల కారణమో ఏమిటో తెలియదు కానీ సాయి ధరమ్ తేజ్ మాత్రం తన ఫిట్ నెస్ మీద పూర్తిగా నిర్లక్ష్యం వహించబట్టే ఇలా మళ్లీ బొద్దుగా తయారయ్యాడనే విమర్శలు మొదలయ్యాయి. ఇంటెలిజెంట్, తేజ్ ఐ లవ్ యూ సినిమాల్లో సాయి ధరమ్ అధిక బరువుతో కనబడి చిరాకు తెప్పించాడు.

అమెరికాలో ఆపరేషన్..?

అయితే అలా లావయితే కష్టమని భావించిన సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్ కోసం బరువు తగ్గేందుకు జిమ్ లో బాగా కష్టపడుతున్నాడని.. త్వరలోనే కొత్త మేకోవర్ తో కనబడతాడనే ప్రచారం జరగడం… తేజ్ ఐ లవ్ యూ తర్వాత బయట కనిపించని సాయి ధరమ్ తేజ్ పూర్తి ఫిట్ తోనే బయటికి రావాలని అనుకుంటున్నట్లుగా చెప్పారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సాయి ధరమ్ తేజ్ అమెరికాలో ఉన్నాడని… అక్కడ ‘లైపో’ ఆప‌రేష‌న్ చేయించుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. తన తదుపరి ప్రాజెక్ట్ చిత్రలహరి కోసం బ‌రువు త‌గ్గాల‌న్న ప్ర‌య‌త్నాలేం ఫ‌లించ‌లేదు కాబట్టి… ఇప్పుడు లైపో ద్వారా త‌గ్గాల‌ని డిసైడ్ అయ్యాడట.

కొత్త లుక్ తో చిత్రలహరి

ఆప‌రేష‌న్ పూర్త‌య్యాక తేజ్ ఇండియా తిరిగొస్తాడ‌ని చెబుతున్నారు. ఇక ‘లైపో’ తో ఒళ్ళు తగ్గించుకుని చిత్రలహరి సినిమా కోసం లుక్ ప‌రంగా కొత్త‌గా కనిపించాల‌న్న‌ది తేజు ఆలోచ‌న‌గా చెబుతున్నారు తేజు సన్నిహితులు. ప్రస్తుతం చిత్రలహరి సినిమా తప్ప తేజు చేతిలో మరో ప్రాజెక్ట్ లేదు. కాకపోతే తేజు ఆ డైరెక్టర్ కి కమిట్ అయ్యాడు… ఈ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడంటూ మొన్నీమధ్య వరకు అనేక రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఏవి అధికారికంగా ఫైనల్ కాలేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*