వెంకీ మామ కథ ఇదేనా?

Venkatesh Nagachaitanya venky mama cinema

వెంకటేష్ – నాగ చైతన్యలు స్వతహాగా మామాఅల్లుళ్లు. అయితే వెంకటేష్ అల్లుడు నాగ చైతన్య తో కలిసి దర్శకుడు బాబీ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ లో వెంకీ మామ అనే మల్టీస్టారర్ చెయ్యబోతున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుని ఎప్పుడో మొదలైనప్పటికీ… ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాలేదు. ఎందుకంటే నాగ చైతన్య ప్రస్తుతం శైలజ రెడ్డి అల్లుడు సినిమా విడుదలతో, సవ్యసాచి సినిమాతో బాగా బిజీగా ఉన్నాడు. ఇక వెంకటేష్ మరో మల్టీస్టారర్ అయిన ఎఫ్ 2 ఫన్ అండ్ ప్రష్టేషన్ తో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ తో కలిసి నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లేకుండా జరగడం.. వెంకీ – చైతు తమ సినిమాలతో ఫ్రీ అయ్యాక ఈ వెంకీ మామ పట్టాలెక్కుతోంది.

మామా అల్లుళ్ల మధ్య ఆసక్తికర సీన్లు…

అయితే ఈ సినిమాలో వెంకటేష్, నాగ చైతన్య ఒరిజినల్ మామాఅల్లుళ్ల మాదిరిగానే సినిమాలోనూ మామ అల్లుళ్లుగా కనిపించబోతున్నారనే విషయం ఎప్పటినుండో ప్రచారంలో ఉన్న విషయమే. అయితే ఈ సినిమా కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. అదేమిటంటే వెంకటేష్ తన సొంత ఊరిలోనే వ్యవసాయం చేసుకుంటూ ఎప్పుడో చిన్నప్పుడే దూరమైన తన చెల్లి, మేనల్లుడి కోసం వెతుకుతాడని… వారి ఆచూకీ దొరక్క కాలం గడుపుతున్న సమయంలో చెల్లెలు, మేనల్లుడి ఆచూకీ తెలియడం.. వారిని కలుసుకునేందుకు వెంకటేష్ సిటీకి వచ్చినప్పటికీ… మేనల్లుడు ఇతనే అని తెలియక చైతుని కలవడం.. ఇక వారి మధ్యన జరిగే పల్లెటూరు, సిటీ సంభాషణలు ఈ సినిమా లో ఒక రేంజ్ లో ఉండబోతున్నాయంటున్నారు.

కామెడీ పండించనున్న వెంకీ

అంటే మామ మాస్ గా పల్లెటూరి వ్యక్తిగా కనబడితే.. అల్లుడు క్లాస్ గా పట్నం కుర్రాడిగా కనిపించబోతున్నారట. ఇక ఈ సినిమాలో మామాఅల్లుళ్లు మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలెట్ అనే రేంజ్ లో ఉంటాయని… వెంకటేష్ లోని కామెడీ యాంగిల్ ని నాగ చైతన్యలోని కొంటె కుర్రాడి యాంగిల్ ని దర్శకుడు బాబీ ఈ సినిమాలో చూపించబోతున్నాడనే టాక్ అయితే ఒక రేంజ్ లో సోషల్ మీడియాలో వినబడుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*