బాలీవుడ్ లోకి విజయ్ దేవరకొండ..?

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సెన్సేషన్ అయిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ ‘టాక్సీవాలా’ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ‘టాక్సీవాలా’కి ముందు వచ్చిన ‘నోటా’ చిత్రం తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు హోప్స్ మొత్తం టాక్సీవాలా పైనే పెట్టుకున్నాడు. నవంబర్ 17న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న విజయ్ ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే తన నెక్స్ట్ మూవీస్ షూటింగ్స్ తో బిజీ అయిపోతాడు. ‘డియర్ కామ్రేడ్’ తో పాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.

తెలుగు ప్రొడ్యూసర్… హిందీ సినిమా

ఇది ఇలా ఉండగా విజయ్ దేవరకొండ ఒక హిందీ సినిమా చేయనున్నాడు అని టాక్. కానీ అది కూడా తెలుగు ప్రొడ్యూసర్స్ తో కలిసి అని టాక్ నడుస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు బాలీవుడ్ లో ఓ డైరెక్టర్ కి అడ్వాన్స్ ఇచ్చారంట. అందులో విజయ్ హీరో అని తెలుస్తుంది. అయితే ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేయకుండా మొత్తం మూడు బాషల్లో తెరకేక్కించాలి అని డిసైడ్ అయ్యారట. ఈ నేపధ్యంలో ఆ హిందీ డైరెక్టర్ మైత్రీ మూవీస్ ఆఫీసులోనే సినిమాకి సంబంధించిన ప‌నుల్ని కూడా మొద‌లు పెట్టేశాడ‌ని తెలుస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*