అంత డబ్బు ఇస్తానన్నా… వద్దన్నాడా?

Ranveer Singh

బాలీవుడ్ లో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో ఎవరు అంటే వెంటనే రణ్వీర్ సింగ్ పేరే చెబుతారు. ఒక సినిమాలో నటించడం అన్నా.. అలాగే యాడ్ షూట్ లో పాల్గొనాలన్నా…. అలాగే స్టేజ్ మీద లైవ్ పెరఫార్మెన్స్ ఇవ్వాలన్నా కూడా రణ్వీర్ సింగ్ ఎంత ఎనర్జీతో రెచ్చిపోతాడో తెలిసిందే. అందుకే రణ్వీర్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. అంతేకాకుండా రణ్వీర్ ఎనర్జీ ,స్టయిల్ కూడా ఆ లేవల్లోనే పెరిగిపోతున్నాయి. రణ్వీర్ నటించే సినిమాలతో పాటే బాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన దీపికా పదుకొనేతో సాగించే ప్రేమాయణంలోను రణ్వీర్ బాగా పాపులర్ అయ్యాడు.

అయితే ఈ మధ్యన ఒక డాన్స్ పెరఫార్మెన్స్ చేస్తే రెండు కోట్లు ఇస్తామన్న ఆఫర్ ని రణ్వీర్ వద్దనేశాడట. రణ్వీర్ సింగ్ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని అతనితో ఒక పెళ్ళిలో డాన్స్ చేయించాలని ఒక కోటీశ్వరుడు ప్లాన్ చేసాడట. మరి శ్రీమంతుల ఇళ్లల్లో సినిమా తారల ఆటలు పాటలు అనేవి కామన్. అందులోను హీరోయిన్ తైతక్కలాడితే ఆ పెళ్ళికి మరింత హంగు ఆర్భాటాలు వచ్చేస్తాయి. అయితే ఇప్పుడు హీరోయిన్స్ అందరిని పక్కన పడేసి బాలీవుడ్లో లో ఫుల్ క్రేజ్ ఉన్న రణ్వీర్ సింగ్ తో ఆ కోటీశ్వరుడు తన ఇంట్లో జరిగే పెళ్లికి అర్ధగంట పాటు డ్యాన్స్‌ చేయాలని కోరడమే కాదు… ఏకంగా హీరోయిన్ కి ఆఫర్ చేసినట్టుగా 2 కోట్లు ఇస్తానని రణ్వీర్ కి ఆఫర్ ఇచ్చాడు.

కానీ ఆ ఆఫర్ ని రణ్వీర్ వదులుకున్నాడట. ఇలా పెళ్లిళ్లలో డాన్స్ చేస్తే తన ఇమేజ్ దెబ్బతింటుందని… ప్రస్తుతం తాను గల్లీబాయ్ అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని.. అలాగే ఇలాంటి పెళ్లిళ్లలో లైవ్ పెరఫార్మెన్స్ ఇస్తే దాని వలన సినిమాలో తన పాత్రపై శ్రద్ధ పెట్టలేనని చెప్పాడట. ఇకపోతే రణ్వీర్ సింగ్ నటించిన గల్లీబాయ్ సినిమా ఏప్రిల్ 14 న విడుదలకు సిద్దమవుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*