అందుకేనా సైలెంట్ అయ్యింది!!

ఆ మధ్యన బాహుబలి విజయంతో రాజమౌళి, శివగామి పాత్రకి శ్రీదేవి తీసుకోకపోవడమే మంచిదైందంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. శ్రీదేవి కోరిన కోర్కెలకు భయపడి ఆమెని శివగామి పాత్ర కు తీసుకోకుండా రమ్యకృష్ణ ని తీసుకున్నామని మీడియాలో మాట్లాడిన రాజమౌళి మాటలకు శ్రీదేవి బాగానే హార్ట్ అయ్యింది. అందుకే అదను చూసుకుని రాజమౌళికి కౌంటర్ వేసింది. తనకి రాజమౌళి చెప్పిన కోర్కెలు ఉంటె గనక ఇన్ని రోజులు సినిమాల్లో ఉండేదాన్ని కాదంటూ రాజమౌళికి సూటిగా తగిలేలా కౌంటర్ వేసి షాక్ ఇచ్చింది.

అయితే రాజమౌళి కూడా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశ్యంతో శ్రీదేవి ని తాను కించపరిచేలా మాట్లాడి ఉండకూడదని…. ఆమెకు సారీ చెప్పేసాడు. ఇక ఇక్కడితో రాజమౌళి, శ్రీదేవి సమస్య సమసిపోనుందని అందరూ అనుకున్నారు. కానీ రాజమౌళికి శ్రీదేవి కి మధ్య ఒక ఒప్పందం కుదిరిన తర్వాత మాత్రమే శ్రీదేవి కాంప్రమైస్ అయినట్టు వార్తలొస్తున్నాయి.

దర్శకధీరుడుకి అతిలోకసుందరి శ్రీదేవి కి జరిగిన ఆ ఒప్పందం ఏంటంటే.. రాజమౌళి తీయబోయే తర్వాత సినిమాలో శ్రీదేవికి ఒక అపూర్వమైన రోల్‌ని రాజమౌళి రిజర్వ్ చేయడమేనట. శ్రీదేవి తన కెరీర్‌లో ఎప్పుడు నటించని ఒక అద్భుతమైన పాత్ర తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌లో వుందని…. అది శ్రీదేవికి తప్పితే ఇంకెవరికీ ఇవ్వబోనని రాజమౌళి ఒట్టేసి చెప్పినట్టు సమాచారం. మరి రాజమౌళి ఇలా ఎవరికీ హామీలిచ్చే టైప్ కాదు. కానీ వీరిద్దరి మధ్యన డీల్ కుదిరినట్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1