అజిత్ బాడీ బిల్డింగ్ పై నాకు కూడా అనుమానం వచ్చింది

బాలీవుడ్ స్టార్ హీరోస్ ని స్ఫూర్తిగా తీసుకున్నాడో ఏమో దక్షిణాదిన యువ కథానాయకులతో పోటీగా బాడీ బిల్డింగ్ చేసిన తొలి సీనియర్ స్టార్ హీరోగా అజిత్ సంచలనం సృష్టించాడు. ఇటీవల విడుదలైన ‘వివేగం’ ఫస్ట్ లుక్ పోస్టర్ లో అజిత్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. అయితే తమిళనాడు రాష్ట్రంలో విజయ్ అభిమానులు ఈ పోస్టర్ లోని అజిత్ లుక్ ని తీవ్రంగానే విమర్శించారు. అజిత్ నిజమైన బాడీ ఇది కాదని, వివేగం ఫస్ట్ లుక్ కోసం వేరొకరి బాడీ కి అజిత్ తలని జోడించి ఫోటోషాప్ తో మాయ చేశారని దుయ్యబట్టారు. ఈ విషయమై సోషల్ మీడియా సాక్షిగా అజిత్ అభిమానులకి విజయ్ అభిమానులకి పెద్ద ఎత్తున వాగ్వాదాలు జరిగాయి.

శుక్రవారం విడుదల కాబోతున్న ఘాజి చిత్రాన్ని ప్రమోట్ చేసుకునే ప్రయత్నాలలో మద్రాస్ వెళ్లిన రానా దగ్గుబాటి అక్కడి మీడియా వారితో ముచ్చటిస్తున్న సమయంలో అజిత్ ప్రస్తావన రాగా, తనకి కూడా అజిత్ సిక్స్ ప్యాక్ ఒరిజినలా కాదా అనే సందేహం వచ్చిందని చెప్పాడు రానా. “బొంబాయి లో ఉండగా ‘వివేగం’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల ఐయ్యింది. ఆ పోస్టర్ చుసిన వెంటనే ఆశ్చర్యం వేసింది. అసలు అజిత్ బాడీ ఏనా కాదా అనే సందిగ్ధం లో పడ్డాను. అప్పుడు నేరుగా అజిత్ కే ఫోన్ చేసి అడిగాను. ఆయన ఇది ఒరిజినల్ బాడీనేనని చెప్పగా నా ఆశ్చర్యం మరింత ఎక్కువ ఐయ్యింది. ఆరంభం చిత్రంలో నేను అతిధి పాత్రలో ఆయనతో నటించినప్పుడు ఆయన శరీరంపై వున్నగాయాలను గమనించాను. ఆయన శారీరకంగా బాగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఈ వయసులో బాడీలో ఇంత చేంజ్ ఓవర్ చూపగలిగారంటే ఆయనకీ హాట్స్ ఆఫ్.” అని ఘాజి ప్రొమొతిఒన్స్ లో అజిత్ డెడికేషన్ గురించి ప్రస్తావించి తమిళుల దృష్టిని ఆకర్షించాడు రానా దగ్గుబాటి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*