అజ్ఞాతవాసిలో వెంకీ కేరెక్టర్ లీక్

అజ్ఞాతవాసి సినిమాలో వెంకీ ఉంటాడనుకుని ఎంతో ఆశతో వెంకీ ఫాన్స్, పవన్ ఫాన్స్ సినిమాకి వెళ్లారు. కానీ ఆ సీన్ ను త్రివిక్రమ్ కట్ చేసి పక్కన పెట్టి తర్వాత యాడ్ చేయాలనుకున్నాడు. సినిమాలో ఆ సీన్ నే కాదు ఇంకా చాలా సీన్స్ వెనక్కి పెట్టేసాడు.

వెంకీ లేటెస్ట్ గా నాగ చైతన్య సినిమా ప్రేమమ్ చైతు మామయ్యగా, డిసిపి రామచంద్రగా కనిపించి జస్ట్ అలా మెరుపులు మెరిపించాడు. ఇప్పుడు అజ్ఞాతవాసి లో కూడా అటువంటి మెరిపించే సీన్ లో నటించాడట. అజ్ఞాతవాసి చిత్ర యూనిట్ మెంబెర్ ఒక్కరు వెంకీ పాత్ర ఎలా ఉంటుందో లీక్ చేసారు. అజ్ఞాతవాసి సినిమాలో ఓ ఫైట్ లో పవన్ పై సైలెంట్ గా తనపై గన్స్ తో అటాక్ చేయడానికి వచ్చిన వాళ్లను హీరో చంపడం. దానికి సినిమాలో త్రివిక్రమ్ భారతంలోని పాండవుల వ్యవహారంతో ముడిపెట్టడం ఆ ఫైట్ చూసిన వాళ్లకి అర్థమైయే ఉంటుంది. ఆ ఫైట్ అయిన తరువాత పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో వెంకీ వస్తాడు.

అలా వచ్చిన వెంకీ ఎవరు చేసారు ఇదంతా అంటాడు. అంటే అప్పుడు హీరో పవన్ ‘నేనే’ అంటాడు. నువ్వా.. ఎందుకు చేసావ్ అంటాడు వెంకీ. నా మీదకు వచ్చారు చంపాను అంటాడు. నమ్మేలా లేదయ్యా.. నువ్వు ఇంతమందిని చంపావంటే అంటాడు వెంకీ. అక్కడితో ఆగుతాడా? నిన్ను చూస్తుంటే, అదేదో సినిమాలో, ‘నాకో తిక్కుంది.. దానికో లెక్కుంది’ అనే డైలాగ్ చెప్పిన హీరొలా కనిపిస్తున్నావు. అతగాడికి నీకు పోలికలు వున్నాయి అంటాడు. అవునా సర్, నేను కూడా చూసాను సర్ ఆ సినిమా, అంటూ లెక్క.. తిక్క డైలాగ్ ను రిపీట్ చేస్తాడు పవన్. దానికి వెంకీ కౌంటర్ వేస్తూ, ‘అబ్బే.. నువ్వు బాగా చెప్పలేదయ్యా.. ఆ హీరోనే బాగా చెప్పాడు’ అంటూ వెళ్లిపోతాడు. అలా వీరిద్దరి మధ్య సాగే సంభాషణ సరదాగా ఉంటుందని ఈ సినిమా యూనిట్ సభ్యుడు చెబుతున్నాడు. మరి ఇది ఎంతవరకు నిజమనేది సంక్రాంతికి అజ్ఞాతవాసిలో యాడ్ చెయ్యబోయే వెంకీ ఎపిసోడ్ చూస్తే గాని తెలియదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1