అజ్ఞాతవాసి రెండో రోజు లెక్కలు చూస్తే ఢమాల్

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం అజ్ఞాతవాసి రెండు రోజుల క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలున్న ఈ చితం విడుదలైన మొదటి షోకే డివైడ్ టాక్ తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ క్రేజ్ కూడా అజ్ఞాతవాసిని కాపాడలేని పరిస్థితి ప్రస్తుతం. అసలు మాటల మాంత్రికుడు ఈ సినిమాని ఎలా మలిచాడా అనే అనుమానంలో పవన్ ఫాన్స్ కొట్టుకుపోయారు. ఫ్రెంచ్ సినిమాని కాపీ కొట్టి తీసినా.. ఈ సినిమాలో త్రివిక్రమ్ మార్క్ ఎక్కడా కనబడం లేదనే టాక్ బాగాస్ప్రేడ్ అయ్యింది. ఇప్పుడు కొత్తగా సీనియర్ హీరో వెంకీ సీన్స్ కలుపుతామన్నా ఆజ్ఞాతవాసి బాక్సాఫీసు వద్ద నిలదొక్కుకునే పరిస్థితి కనబడడం లేదు. మొదటి రోజు రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోయిన అజ్ఞాతవాసి డివైడ్ టాక్ కారణంగా రెండో రోజు ఆ కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. మొదటి రోజు అజ్ఞాతవాసి ప్రపంచ వ్యాప్తంగా 60 కోట్ల షేర్ కొల్లగొడితే రెండో రోజు కేవలం 10 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. మరి ఈ లెక్కన అజ్ఞాతవాసి డిజాస్టర్ అయినట్లే లెక్క. ఇక ఏరియాల వారీగా అజ్ఞాతవాసి రెండు రాష్ట్రాల రెండు రోజుల లెక్కలు మీ కోసం.

ఏరియా – రెండు రోజుల లెక్కలు (కోట్లలో)
నైజాం: 7 .32
సీడెడ్: 3 .90
నెల్లూరు: 1 .75
గుంటూరు: 4 .06
కృష్ణ: 2.14
తూర్పు గోదావరి: 3 .04
పశ్చిమ గోదావరి: 3.83
ఉత్తరంధ్ర: 4 .20

ఆంధ్ర మరియు తెలంగాణ మొత్తం: 30 .24 కోట్లు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1