అతని ముందు ఓటమికి విజయేంద్ర ప్రసాద్ ఆనందం

ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పుడు కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకి మాత్రమే పరిమితమైన కథా రచయిత కాదు. గత ఏడాది విజయదశమి కి విడుదలైన కన్నడ చిత్రం జాగ్వార్ చిత్రానికి కథా అందించింది, అంతకు ముందు భారత దేశ చలన చిత్ర సంచలనాల చరిత్రలో కొత్త అధ్యయనానికి తెర తీసిన భజరంగి భాయ్ జాన్ చిత్రానికి కథ అందించింది విజయేంద్ర ప్రసాదే. కథా రచయితగా ఒక వైపు యావత్ భారత దేశంలో సినిమా అభిమానులకు చేరువ ఐన విజయేంద్ర ప్రసాద్ ఇప్పుడు మరో సారి మెగా ఫోన్ పట్టి శ్రీ వల్లి చిత్రాన్ని తెరకెక్కించారు. విడుదలకి సిద్దమైన ఈ చిత్రం ప్రొమోషన్స్ పై దృష్టి సారించకుండా ఆయన తన అన్న కొడుకు కాంచి తెరకెక్కించిన షో టైం సినిమాని ఎక్కువగా ప్రమోట్ చేస్తుండటం గమనార్హం.
“మా ఇంట్లో ఎవరు ఏ సినిమాకి పని చేసినా మా పనిలో తప్పులని వెతికి పడుతూ మమ్మల్ని విమర్శిస్తూ ఉంటాడు కాంచి. అది ఒక్కో సారి మాకు కోపం కూడా తెప్పిస్తుంటుంది. అందుకే కాంచి ఎప్పుడెప్పుడు సినిమా చేస్తాడా అని మా కుటుంబ సభ్యులందరు ఎదురు చూసాం. ఇప్పుడు కాంచి మాకు దొరుకుతాడని మా ఆశ. అయితే మేము కాంచిని విమర్శించాలంటే అతను లాజిక్ లెస్ షాట్స్ ఏవో ఒకటి అట్టెంప్ట్ చేసి ఉండాలి. చూస్తుంటే షో టైం ని చాలా ప్రొఫెషనల్ మేకర్ తెరకెక్కించినట్టు తెరకెక్కించినట్టున్నాడు. ఈ సారికి కాంచి మాకు దొరికే అవకాశం లేదు. కాబట్టి అతని చేతిలో నేను మరొక సారి ఓటిమి చెందాను. అయితే ఈ ఓటమిని నేను సంతోషంగా స్వీకరిస్తున్నాను. షో టైం సూపర్ సక్సెస్ అవుతుందని నా ప్రగాఢ నమ్మకం.” అంటూ షో టైం చిత్రాన్ని ప్రజలలోకి తీసుకెళ్లే విధంగా ప్రసంగాలు చేస్తున్నారు విజయేంద్ర ప్రసాద్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*