అనసూయ హడావిడి తగ్గిందా?

anasuya bharadwaj telugu post telugu news

ఈ మధ్యన అనసూయ హడావిడి బయట పెద్దగా వినబడడం లేదు. ఏదో జబర్దస్త్ లో అలా కనబడుతుంది… అంతేకాని మరే ఇతర ప్రోగ్రాం లోను అనసూయ హడావిడి ఎక్కడా కనబడలేదు. ఉగాది సందర్భంగా పలు ఛానల్స్ ఉగాది కి స్పెషల్ ప్రోగ్రామ్స్ చేశాయి. ఉగాది రోజు ఉదయం నుండి ప్రముఖ ఛానల్స్ లో ప్రసారం అయినా ఒక్క ఉగాది స్పెషల్ ఈవెంట్ లోను అనసూయ కనబడలేదు. ఒక్కో ప్రోగ్రాం కి ఒకో యాంకర్ కనబడుతుంది…. కానీ అనసూయ మాత్రం ఎక్కడా కనబడలేదు. మరి మొన్నామధ్యన ఒక సమస్యలో చిక్కుకుని సోషల్ మీడియా ని వదిలేసింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వుండే అనసూయ ప్రస్తుతం సోషల్ మీడియాకి ఆమడ దూరంలో ఉంది.

ఇక అనసూయ వెండితెర మీద నటించిన గాయత్రీ సినిమా ఆమెకి ఎలాంటి పేరు తీసుకురాలేకపోయింది. మరి అమ్మడు రాంచరణ్ రంగస్థలం సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకుంది. ఆ సినిమా మార్చ్ 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి అమ్మడు గురించిన రంగస్థలం ముచ్చట్లు ఈ రోజు ఆదివారం విడుదల చెయ్యబోయే రంగస్థలం ట్రైలర్ లో ఏమైనా తెలుస్తుందేమో చూడాలి. అలాగే అనసూయ మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న సచ్చిందిరా గొర్రె పరిస్థితి ఏమిటో కూడా స్పష్టత లేదు. ఇక జబర్దస్త్ కోసం, జెమినిలో జూలకటక కోసం అనసూయ చేయించుకునే ఫోటో షూట్స్ కూడా సోషల్ మీడియాలో కనబడడం లేదు. మరి ఏది ఎలాగున్నా అనసూయ హడావిడి అయితే బయట తగ్గినట్లుగానే కనబడుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*