అబ్బో చరణ్ కి అదిరిపోయే సర్ప్రైజ్ లు

upasana dubai trip

ఈరోజు మార్చ్ 27 మెగా హీరో రామ్ చరణ్ పుట్టినరోజు. ప్రస్తుతం రంగస్థలం సినిమాని పూర్తి చేసి దాని విడుదల కోసం వెయిట్ చేస్తున్న రామ్ చరణ్ తన బర్త్ డే వేడుకని భార్య ఉపాసన సమక్షంలో జరుపుకుంటున్నాడు. గత ఏడాది ఇదే రోజు రామ్ చరణ్ కోసం ఉపాసన రంగస్థలం సెట్స్ లో సందడి చేసింది. రామ్ చరణ్ కి ఊపిరి సలపనంత బిజీలో ఉంటె ఉపాసనే అక్కడికి వెళ్లి చరణ్ బర్త్ డే ని రంగస్థలం టీమ్ తో కలిసి సెలెబ్రేట్ చేసింది. కానీ ఇప్పుడు రంగస్థలం షూటింగ్ పూర్తి చేసి ఖాళీ అయిన చరణ్ తన భార్యతో కలిసి తన పుట్టినరోజు వేడుకల్ని జరుపుకుంటున్నాడు.

మరి ఎప్పుడూ తన భర్త విషయాలను ఎంతో ఉత్సాహంగా ఆనందంగా సోషల్ మీడియాలో పంచుకునే ఉపాసన తాజాగా భర్త మిస్టర్ సి పుట్టినరోజుకి రామ్ చరణ్ కి అదిరిపోయే సర్ప్రైజ్ లు ప్లాన్ చేసింది. రామ్ చరణ్ కి పుట్టిన రోజు విషెస్ చెబుతూ మిస్టర్ సి అంటూ పూలతో స్వాగతం చెప్పడమే కాదు.. ఇంకా క్యాండిల్స్, కేక్ వంటి వాటితోను రామ్ చరణ్ కి మిస్టర్ సి అంటూ అక్షరాలు పేర్చి అందమైన శుభాకాంక్షలు తెలియజేసింది. పూలతో నేలమీద మిస్టర్ సి అంటూ రాసిన వాటి ముందు రామ్ చరణ్ మొహం కనబడకుండా నించున్నాడు.

మరి తన భార్య ఇలా అందంగా తన పుట్టిన రోజుకి ప్లాన్ చేస్తే ఏ భర్త అయినా మురిసిపోడు. మరి ప్రస్తుతం రామ్ చరణ్ కూడా అదే మూడ్ లో ఉన్నాడు. మరి పుట్టిన రోజు కి ముందే అంటే రెండు రోజుల ముందే తన తల్లితండ్రులు మెగాస్టార్ చిరంజీవి, తల్లి సురేఖల నుండి సర్ప్రైజ్ గిఫ్ట్ అందుకున్న చరణ్ ఇప్పుడు పుట్టినరోజునాడు ఉపాసన చేసిన ఈ బర్త్ డే ప్లాన్ కి ఇంకా మురిసిపోతున్నాడు. మరి ఉపాసన చేసిన బర్త్ డే ప్లాన్ ఫోటోలు సోషల్ మీడియా లో ఒక లెవల్లో హల్చల్ చేస్తున్నాయి. ఇక వాటిని మెగా ఫాన్స్ కూడా షేర్ ల మీద షేర్స్ కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

29694669_574223209624105_1461218627041080618_n

29595462_574223206290772_4165554833018193782_n

29542178_574223242957435_5345230335703901750_n

29541085_574223239624102_844669349088712067_n

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*