అబ్బో సూపర్ కాంబినేషన్ ఇది!

నక్షత్రం దెబ్బకి కృష్ణవంశీ పనైపోయింది. అసలు ఎవరైనా కృష్ణవంశీకి అవకాశం ఇస్తే అది ఆయనకి పునర్జున్మనిచ్చినంత అదృష్టం అనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరిగింది. అలాగే టాలీవుడ్ లో సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా చాల కాలంగా అటు సినిమాలను తెరకెక్కించడంలేదు. అసలు సినిమాలు కూడా నిర్మించడంలేదు. అయితే ఇప్పుడు ఇన్నాళ్ళకి తమ్మారెడ్డి ఒక సినిమా మొదలుబెట్టబోతున్నట్టుగా టాక్ వినబడుతుంది. అయితే తమ్మారెడ్డి సినిమాని కృష్ణవంశీ దర్శకుడిగా నిర్మించబోతున్నాడనేదే ఇక్కడ షాకింగ్ విషయం.

ఇకపోతే ఆ సినిమాలో హీరోలు కూడా అలాంటి ఇలాంటి వాళ్ళు కాదండోయ్. వారు తియ్యబోయే కథలో రెండు కీలకపాత్రలు ఉంటాయట. అయితే ఆ పాత్రలకు నేనే రాజు నేనే మంత్రి హీరో రానాని, సవ్యసాచితో తెలుగులోకి మరోమారు అడుగెడుతున్న మాధవన్ ని తీసుకోవాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. మరి రానా, మాధవన్ లు హీరోలుగా తీసుకుంటే ఈ సినిమాకి తెలుగు, తమిళంలో కూడా మంచి మర్కెట్ ఉంటుందని ఆలోచన చేస్తున్నారట. మరి ఫెడవుట్ అనుకున్న దర్శకుడితో రానా సినిమా చేస్తాడా?

అయితే కెరీర్ లో పూర్తిగా డౌన్ ఫాల్ లో ఉన్న తేజకి రానా నేనే రాజుతో అవకాశమిచ్చి అదిరిపోయే హిట్ కొట్టాడు రానా. మరి ఇప్పుడు రానా కూడా ఒకే అంటే సరిపోదు. రానా తండ్రి సురేష్ బాబు కూడా ఆ కథని ఒకే చెయ్యాలి… ఇంత ప్రాసెస్ వుంది ఆ సినిమా పట్టాలెక్కలి అంటే.. చూద్దాం ఈ సినిమా అధికారికంగా ప్రకటించేవరకు అనుమానమే అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1