అయ్యో అలా జరిగిందా….!

rakul out from venky mama film

టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ కి ఇప్పుడు ఒక బంగారంలాంటి ఆఫర్ చేజారింది. అది అలంటి ఇలాంటి ఆఫర్ కాదు. ఏకంగా పవన్ కళ్యాణ్ వంటి స్టార్ పక్కన నటించే ఛాన్స్ మిస్ చేసుకుందట. రకుల్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టినప్పటినుండి వరుసగా ఛాన్స్ లు దక్కించుకుంటూ క్షణం తీరిక లేకుండా హిట్స్ తో ప్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతుంది. ఆమెకి ఈ 2017   డైరీ అప్పుడే ఫుల్ అయిపొయింది. ఒక పక్క సూపర్ స్టార్ మహేష్ తో మురుగదాస్ డైరెక్షన్లో నటిస్తోంది. మరోపక్క నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్, బెల్లంకొండ శ్రీనివాస్ వంటి స్టార్స్ పక్కన కూడా నటిస్తూ ఫుల్ల్ బిజీ గా వుంది. ఇక ఇప్పుడు వరస ఆఫర్స్ తో ఉక్కిరిబిక్కిరిలో కొట్టుకుంటున్న రకుల్ కి పాపం డేట్స్ ఖాళీ లేక ఇప్పుడు మంచి ఆఫర్ ని వదులుకుందట.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – ఎం ఎం రత్నం కాంబినేషన్లో తెరకెక్కబోయే కొత్త చిత్రంలో రకుల్ బంగారంలాంటి ఛాన్స్ మిస్ చేసుకుందట. పాపం రకుల్ దురదృష్టం ఎలా ఉందొ చూశారా… పవన్ పక్కన ఛాన్స్ వచ్చినా చెయ్యలేని పరిస్థితి. పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఎం ఎం రత్నం చిత్ర యూనిట్ వాళ్ళు రకుల్ ప్రీత్ సింగ్ ని తమ చిత్రంలో హీరోయిన్ గా చేయాల్సిందిగా సంప్రదించేందుకు రకుల్ దగ్గరికి వెళ్లగా ఆమె ఆ ప్రపొసల్ ని సున్నితంగా తిరస్కరించిందట. దీంతో వాళ్ళు ఉసూరుమనడం ఏమో కానీ రకుల్ మాత్రం బాగా బాధపడుతుందట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*