అల్లు అర్జున్ – అనుల కెమిస్ట్రీ అదుర్స్!

వక్కంతం వంశి అనే కొత్త దర్శకుడితో అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా చేస్తున్నాడు. అను ఇమ్మాన్యువల్ తో జోడి కడుతున్న అల్లు అర్జున్ తన సినిమాని ఏప్రిల్ 26 న విడుదల చెయ్యాలని డిసైడ్ అవడమే కాదు… అధికారికంగా కూడా ప్రకటించాడు. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఆర్మీ జవాన్ గా నటిస్తున్నాడు. జనవరిలో నా పేరు సూర్య ఫస్ట్ ఇంపాక్ట్ తో కొత్తగా అభిమానులకు ట్రీట్ ఇచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు సాంగ్స్ తో ఉర్రుతలూగిస్తున్నాడు. అప్పుడప్పుడు అను ఇమ్మాన్యువల్ తో కలిసి రొమాంటిక్ ఫోజులతో పిక్స్ ని వదులుతూ హల్చల్ చేస్తున్న బన్నీ ప్రస్తుతం నా పేరు సూర్య సాంగ్స్ ని వదులుతూ హాడావిడీ మొదలెట్టేసాడు.

విశాల్ – శేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటలను ఒక్కొక్కటిగా మార్కెట్ లోకి వదులుతున్నారు. ఈరోజు ఫిబ్రవరి 14 న వాలంటైన్స్ డే విషెస్ తో అల్లు అర్జున్, అను ఇమ్మాన్యువల్ తో కలిసి చిందులేసిన లవ్వర్ ఆల్సో ఫైటర్ ఆల్సో పాటలో అల్లు అర్జున్, అను ఇమ్మాన్యువల్ ల ఫొటోస్ గ్రాఫ్స్ తో కూడుకున్న వీడియో ని యూట్యూబ్ లో వదిలింది చిత్ర బృందం. మరి ఆ పాట ఎంతో శ్రావ్యంగా… లయబద్దంగా… తియ్యగా ఆకట్టుకుంటుంది . ఇక అల్లు అర్జున్, అను ఇమ్మాన్యువల్ ల రొమాంటిక్ ఫొటోస్ మాత్రం అబ్బో… అనిపించాయి. అల్లు అర్జున్ కొత్త స్టైల్, అను ఇమ్మాన్యువల్ అందాలు… ఇలా అన్ని సూపర్ గా కనబడుతున్నాయి. ఈ సినిమాకి అను ఇమ్మాన్యువల్ గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్ అన్నట్టుగా ఉంది ఈ పాట వీడియో. అను ఇమ్మాన్యువల్ పాట లిరికల్ వీడియో లోనే ఇంత హాట్ హాట్ గా ఉంటే సినిమాలో మరెంత హాట్ గా ఉంటుందో అనే క్యూరియాసిటీ పెరిగిపోతుంది కూడా.

అలాగే అల్లు అర్జున్, అను ల కెమిస్ట్రీ మాత్రం బాగా పండింది. లవర్స్ డే రోజున ఇలాంటి పాటతో పాటే అను, బన్నీల రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి. మరి వక్కంతం వంశి డైరెక్షన్ కి కొత్త అయినప్పటికీ సినిమాని ఎంతో నీటుగా, మంచి వేరియేషన్ తో ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడనేది స్పష్టమవుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1