ఆయన ఖైదీ నెం.150 అయితే ఇతను ఖైదీ నెంబర్ లెస్

అతి చిన్న వయసులో కెరీర్ లో వరుస వైఫల్యాలను ఎదుర్కొని వాటికి తట్టుకుని నిలబడి తిరిగి ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాలతో తన ఉనికిని చాటుకున్న యంగ్ హీరో నితిన్ తరువాత హార్ట్ ఎటాక్, చిన్నదాన నీకోసం, కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి చిత్రాలతో కొంతకాలం మళ్లీ ఇబ్బంది పడినప్పటికీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అ ఆ’ చిత్రంతో తన బౌన్స్ బ్యాక్ ని స్ట్రాంగ్ గా చూపిస్తూ ఆ చిత్రాన్ని తన ట్రాక్ రికార్డు గా నిలుపుకున్నాడు. అయితే స్వతహాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని కావటంతో నితిన్ తాను నటించే ప్రతి చిత్రంలో కనీసం ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ నామ స్మరణ చేస్తుంటాడు. పైగా ఇతర కథానాయకుల సినిమా వేడుకలకు పెద్దగా హాజరు అవ్వని పవర్ స్టార్ అడపా దడపా నితిన్ సినిమా వేడుకలకి హాజరు అవుతూ తన ప్రియతమ అభిమానిగా నితిన్ కి ప్రత్యేక గుర్తింపు ఇవ్వటంతో పవర్ స్టార్ ఫాన్స్ నుంచి కూడా నితిన్ కి సపోర్ట్ బాగానే ఏర్పడుతుంది.

కాగా ఇప్పుడు నితిన్ చేస్తున్న చిత్రంలోని గెటప్ పవర్ స్టార్ ని దాటుకుని మెగా స్టార్ చిరంజీవి తో పొంతన పెట్టుకునే స్థాయికి చేరిపోయింది. హను రాఘవపూడి దర్శకత్వంలో లై(లైఫ్ ఈజ్ ఎండ్లెస్) చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్న నితిన్ ఈ చిత్రంలో జైలు శిక్ష అనుభవించే ఖైదీగా వెనక్కి తిరిగి వున్నా ఒక స్టిల్ తో రివీల్ అవగా ప్రముఖ కాస్ట్యూమ్ డిసైనర్ కోన నీరజ తన స్నేహితుడు, వ్యాపార భాగస్వామి నితిన్ స్టిల్ ని పోస్ట్ చేస్తూ ఖైదీ నెం.150 ని జ్ఞాపకానికి తెచ్చేలా నితిన్ కి ఖైదీ నెంబర్ లెస్ అంటూ ట్వీట్ చేసి నితిన్ ని టాగ్ చేసింది. ఇప్పుడు నీర్జా చేసిన ఈ ట్వీట్ కి అభిమానుల నుంచి భారీగా రీ ట్వీట్స్ వస్తున్నాయి.

Khaidi Numberlesssssss …. On the sets with @actor_nithiin & @hanurpudi

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*