ఆ కుటుంబంలో విభేదాలు లేవనటానికి నిదర్శనం

బాలీవుడ్ మెగా స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కుటుంబం లో విభేదాలు తార స్థాయికి చేరాయని, బిగ్ బి శ్రీమతి జయా బచ్చన్ అసలు తన కోడలు ఐశ్వర్య రాయ్ బచ్చన్ ముఖం చూడటానికి కూడా ఇష్టపడటం లేదని గత కొంతకాలం గా ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలన్నిటిలో అనేకానేక కథనాలు వెలువడుతున్నాయి. నిత్యం తన వృత్తిపరమైన అనుభవాలతో పాటు వ్యక్తిగత జీవితపు విశేషాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకునే బిగ్ బి అమితాబ్ కూడా ఈ వార్తలపై స్పందించక పోవటం తో ఈ వార్తల్లో వాస్తవాలున్నాయని అందరూ నమ్మటం జరిగింది. మొన్నామధ్య హిందీ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఐశ్వర్య ఈ విషయం పై ఖండించినప్పటికీ ఈ వార్తలు ఆగలేదు.

తాజాగా జరిగిన స్టార్ డస్ట్ అవార్డ్స్ వేడుకలో కొన్ని ఫోటోలు ఈ వార్తలన్నీ వస్తావా దూరమని, బచ్చన్ కుటుంబంలో విభేదాల కథనాలకు తెర దింపాయి. అసలు జయ బచ్చన్ కి తన కోడలు ఐష్ మధ్య సఖ్యత లోపించటానికి బిడ్డ కు జన్మ నిచ్చిన కొంత కాలానికి తిరిగి నట జీవితం ప్రారంభించిన ఐష్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో పోషించిన పాత్రలే కారణమని వార్తలొచ్చాయి. ముఖ్యంగా హే దిల్ హై ముష్కిల్ లో ఐశ్వర్య మితిమీరిన ఇంటిమేట్ సన్నివేశాలలో కనిపించటం జయ జీర్ణించుకోలేకపోయారని బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఐశ్వర్య రాయ్ బచ్చన్ సరబ్జిత్ చిత్రానికి గాను ప్రదర్శించిన నటనకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు గెలుచుకోగా ఆ అవార్డు ను తన భర్త అభిషేక్ బచ్చన్ తో కలిసే అందుకుంటానని పట్టుబట్టడం, పైగా తన మామగారు అమితాబ్ ఆ పురస్కారం అందచేస్తునప్పుడు ఆయన పాదాలకు ఐష్ నమస్కరించగా బిగ్ బి ఆవిడను పైకి లేపటం, వేదిక కింద కూర్చున్న జయా బచ్చన్ భుజం పై అలసిన ఐష్ సేదతీరుతుండగా తీసిన ఫోటోలు బచ్చన్ కుటుంబంలో ఐశ్వర్య కారణంగా ఎలాంటి విభేదాలు తలెత్తలేదని తేల్చేశాయి. బిగ్ బి ఇంత కాలం సోషల్ మీడియా లో స్పందించనప్పటికీ ఈ ఫోటోల ద్వారా అందరికి స్పష్టత వచ్చేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*