ఆ హీరోయిన్ కి బుద్ది చెప్పాలనుకుంటున్నాడు

ఈ మధ్యన లావణ్య త్రిపాఠిని వరుస ప్లాపులు వెంటాడుతున్నాయి. లావణ్య తాజాగా నటించిన యుద్ధం శరణం కూడా ప్లాప్ అయ్యింది. అయితే ఆమె సినిమాలు ప్లాప్ అవడమేమో గాని… ఇప్పుడు లావణ్య సైన్ చేసిన ప్రాజెక్టులనుండి బయటికి వచ్చేసి ఫుల్ గా హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా లావణ్య త్రిపాఠి మీద ఒక ఫిర్యాదు సౌత్ ఫిల్మ్ ఛాంబర్‌లో నమోదు అయినట్లుగా చెబుతున్నారు. ఆ కేసు కథా కమామిషు ఏమిటో మీరే చూడండి. లావణ్య త్రిపాఠి ఒక తమిళ సినిమా కి కమిట్ అవడం అనుకోని కారణాలతో లావణ్య ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న విషయం తెలిసిందే.

తమిళ 100 పర్సెంట్ లవ్ చిత్రంలో ముందుగా దర్శకుడు హీరోయిన్ గా లావణ్య ని ఫైనల్ చేసి మరీ ప్రీ ప్రొడక్షన్ పనిలోకి దిగాడు. అయితే లావణ్య ని అధికారికంగా హీరోయిన్ గా తీసుకుని ఈ నెలలోనే సెట్స్ మీదకి వెళ్లాలనుకున్న చిత్ర బృందానికి లావణ్య ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకుని షాక్ ఇచ్చింది. అయితే లావణ్య అలా సడన్ గా ఎందుకు డ్రాప్ అయ్యిందో తెలియదు గాని… ఇప్పుడు ఆ సినిమా దర్శకుడు చంద్రమౌళి. మాత్రం లావణ్య త్రిపాఠి పై ఫిర్యాదు చేసాడు. సినిమా ప్రై ప్రొడక్షన్ పని ముగించుకుని సెట్స్ మీదకెళ్లే టైం లో ఇలా లావణ్య తప్పుకోవడంతో…. సమయం వెస్ట్ అవడంతోపాటే…. చాల డబ్బు కూడా లాస్ అయినట్లు చంద్రమౌళి ఫిర్యాదులో పేర్కొన్నాడు.

మరి ఆ దర్శకుడు సౌత్ ఫిల్మ్ ఛాంబర్‌లో లావణ్యపై ఫిర్యాదు చేశాడు. ఇక దర్శకుడు ఫిర్యాదుపై సౌత్ ఫిల్మ్ ఛాంబర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1