ఇలియానా కి కాలం కలిసొచ్చేలా కనబడుతుంది

ప్రస్తుతం ఇలియానా బాలీవుడ్ నుండి టాలీవడ్ కి వచ్చి చేరింది. గతంలో టాలీవుడ్ లో హిట్ సినిమాల్తో కెరీర్ పీక్స్ లో ఉండగా బాలీవుడ్ ఆఫర్ రాగానే అక్కడ సెటిల్ అవుదామనుకున్న ఇలియానా కి బాలీవుడ్ షాక్ ఇచ్చింది. బాలీవుడ్ అవకాశాల కోసం కాచుకుని కూర్చున్న ఇలియానా టాలీవుడ్ ని తిట్టి పోసింది. టాలీవుడ్ దర్శకులు కేవలం నడుమందాలు చూస్తారంటూ… వెటకారంగా మాట్లాడింది. అయితే బాలీవుడ్ లో అమ్మడుకి ఓ అనుకున్నంత అవకాశాలు అయితే రాలేదు. ఇక కొన్నాళ్ళు బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకునితిరిగిన ఇలియానా కి టాలీవుడ్ నుండి శ్రీను వైట్ల పిలిచి రవితేజ సరసన అమర్- అక్బర్- ఆంటోని సినిమాలో హీరోయిన్ అవకాశం ఇచ్చాడు.

ఇక ఇలియానా మారుమాట్లాడకుండా రవితేజ సినిమాలో చెయ్యడానికి ఒప్పేసుకుంది. అయితే అమ్మడుకి ఈ అవకాశం తో మళ్ళీ లక్కు తిరిగి వచ్చినట్లే కనబడుతుంది. ఎందుకంటే టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోయిన్స్ కొరత బాగా ఉంది. కేవలం పూజ హెగ్డే, కైరా అద్వానీ లు మాత్రమే స్టార్ హీరోలకు హీరోయిన్స్ గా కనబడుతున్నారు. ఎందుకంటే ప్రత్యామ్న్యాయం గా మరో హీరోయిన్స్ ఎవరూ కనబడడం లేదు. అందుకే చాలామంది దర్శక హీరోలు కొత్త హీరోయిన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇప్పుడు తిరిగి టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న ఇలియానా మీద దర్శక నిర్మాతల చూపు పడింది.

రవితేజ సినిమా లో షూటింగ్ లో జాయిన్ అయిన ఇలియానా పై ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించే దర్శకనిర్మాతలు కన్ను పడిందట. మరి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగిన ఇలియానా కి మైండ్ పాడై బాలీవుడ్ లో చక్రం తిప్పుదామనుకుని ఉసూరుమంది. మళ్ళీ ఇప్పుడు టాలీవుడ్ లోకి రి ఎంట్రీ ఇస్తున్న ఇలియానా కి మళ్ళీ లక్కు కలిసొచ్చేలాగే కనబడుతుంది. చూద్దాం ఇలియానా రి ఎంట్రీ హిట్ అవుతుందో… లేకుంటే ప్లాప్ అవుతుందో అనేది. కానీ రవితేజ సరసన నటిస్తున్న అమర్- అక్బర్- ఆంటోని సినిమా హిట్ అయ్యిందా ఇలియానా సుడి తిరిగినట్లే

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*