ఈసారి అదరగొట్టేస్తాడట.. !!

గత ఏడాది ఐఫా ఉత్సవాన్ని ఎంతో గ్రాండ్ గా చేసిన టాలీవుడ్ ఈ ఏడాది కూడా అంతే గ్రాండ్ గా చెయ్యడానికి ఏర్పాట్లు చేస్తుంది. గతఏడాది టాలీవుడ్ యంగ్ స్టార్స్ అయిన రామ చరణ్, అఖిల్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ స్టేజి మీద డాన్స్ పెరఫామెన్స్ తో చంపేశారు. ఎప్పుడూ బాలీవుడ్ ఈవెంట్స్ ని మాత్రమే పొగిడేవారు… ఇప్పుడు టాలీవుడ్ ని కూడా పొగడడం మొదలు పెట్టేసారు. బాలీవుడ్ లో ఏదన్న అవార్డు ఫంక్షన్ గాని మరేదైనా ఈవెంట్ గాని జరుగుతుంది అంటే అక్కడి స్టార్ హీరోలు కూడా అదిరిపోయే పెరఫార్మన్స్ తో అదరగొడతారు. ఇక టాప్ హీరోయిన్స్ సరేసరి.. వారూ తమ పెరఫార్మెన్సెస్ తో ఆ ఫంక్షన్ ని తెగ ఎంజాయ్ చేస్తారు. కానీ టాలీవుడ్ లో అలా కాదు స్టార్ హీరోలు ఏదైనా స్టేజి పెరఫార్మెన్సు చెయ్యడానికి అస్సలు ముందుకు రారు. కానీ గతఏడాది జరిగిన ఐఫా ఉత్సవంలో మాత్రం టాలీవుడ్ టాప్ హీరోలు కూడా స్టేజి పెరఫార్మెన్సెస్ తో అదరగొట్టేసారు.

ఇక ఇప్పుడు ఈ నెల 28 న హైద్రాబాద్లో జరగబోయే ఐఫా ఉత్సవం 2017 లో కూడా అఖిల్ మంచి డాన్స్ పెరఫార్మెన్సు తో అదరగొట్టబోతున్నాడని మరో యాంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ చెబుతున్నాడు. ఇప్పటికే ఐఫా ఉత్సవం రిహార్సల్స్ లో అఖిల్ ఫుల్ బిజీగా వున్నాడని సాయి ధర్మ తేజ్ చేసిన చిలిపి ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తుంది. సాయి అడిగిన ప్రశ్నలకు అఖిల్ సమాధానాలు మీరే చూడండి.

సాయి: అఖిల్ ఎలా వున్నావు అని అడగగా దానికి అఖిల్ నేను బావున్నాను అని చెప్పగా…. సాయి గత ఏడాది ఐఫా ఉత్సవంలో మీరు డాన్స్ పెరఫార్మెన్సు చేసినట్లే ఇప్పుడు ఈ ఏడాది ఐఫా ఉత్సవంలో కూడా మీ పెరఫార్మెన్సు ఉండబోతుందా? మీరు ఎలా ఫీలవుతున్నారని అడగగా దానికి అఖిల్ నవ్వుతూ ఈసారి ఐఫా ఉత్సవానికి ఎంతో ఉత్సహం గా ఉన్నానని.. నా కలలో కూడా వుహించుకోలేని మూమెంట్ఇది అని సమాధానం చెప్పాడు. ఇంకా ఈ ఉత్సవంలో చాలా ఫన్ వస్తుందని సరదా సమాధానాలతో ఈ ఇంటర్వ్యూ ఎండ్ చేసాడు అఖిల్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*