ఈసారి కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు!!

ఎప్పుడూ మాస్ చిత్రాలనే నమ్ముకుని టాలీవుడ్ లో గెంటుకొస్తున్న గోపీచంద్ కి ఈ మధ్యన కాలం కలిసిరావడం లేదు. ఇప్పుడు గోపీచంద్ తో సినిమా చెయ్యాలని అంటే నిర్మాతలు దడుస్తున్నారు. కారణం గోపీచంద్ సినిమాలు పూర్తయినా అవి విడుదల అవుతాయో లేదో అనే భయం పట్టుకుంది. మొన్నామధ్యన ఆరడుగుల బుల్లెట్ థియేటర్స్ దగరికి వచ్చి మరి ఆగిపోయింది. ఇలా గోపీచంద్ సినిమాలు ఆడకపోవడానికి కారణం అతని హోమ్ బ్యానర్ లా… వుండే భవ్య క్రియేషన్స్ ని వదులుకోవడమే అంటున్నారు గోపీచంద్ సన్నిహితులు. జిల్ సినిమా టైం లో వచ్చిన మనస్పర్థలు కారణంగా గోపీచంద్ కి భవ్య వారికి చెడింది.

అయితే ఇప్పుడు గోపీచంద్ కాస్త కాన్ఫిడెంట్ గానే కనబడుతున్నాడు. కారణం సంపత్ నంది డైరెక్షన్ లో వస్తున్నా గౌతమ్ నందా చిత్రం పై భారీ అంచనాలు ఉండడమే. ఈ గౌతమ్ నందా చిత్రం ఖచ్చితంగా హిట్టవుతుందని…. కానీ అది ఏ రేంజ్ హిట్టో అప్పుడే చెప్పలేనంటున్నాడు గోపీచంద్. గౌతమ్ నందా ఆడియో వేడుకలో మాట్లాడిన గోపీచంద్…. సంపత్ నంది రెండున్నర గంటలపాటు తనకి ఈ సినిమా కథ వినిపించాడని…. అందులో ఎటువంటి తేడా లేకుండా సినిమాని తెరకెక్కించాడని చెప్పాడు. తాను పనిచేసిన డైరెక్టర్లలో అందరిలో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ సంపత్ నంది అంటూ ఆకాశానికెత్తేసాడు.

మరి ఇంత కాన్ఫిడెంట్ గా గోపీచంద్ ఉన్నాడు అంటే గౌతమ్ నందా మీద ఎంత నమ్మకం లేకపోతె ఇలా అంటాడు. ఇకపోతే ఈ చిత్రంలో గోపీచంద్ సరసన హన్సిక, కేథరిన్ లు నటిస్తున్నారు. గౌతమ్ నందా చిత్రం మాస్ మరియు క్లాస్ చిత్రంగా ఆకట్టుకోబోతుందని థియేట్రికల్ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఇక ఈ చిత్రం ఈ నెల 28 న విడుదల కాబోతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1