ఈసారి పక్కానే!!

సుమారు రెండేళ్ల గ్యాప్ తీసుకొని రవితేజ నటించిన చిత్రం ‘రాజా-ది గ్రేట్’. దీపావళి సందర్భంగా గత నెల 18న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించింది. ఆ తరువాత రవితేజ తన తదుపరి చిత్ర పనుల్లో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న చిత్రం ‘టచ్ చేసి చూడు’ . నూతన దర్శకుడు విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ఈ కొత్త చిత్రం రాబోతుంది. వక్కంతం వంశి ఈ చిత్రానికి కథను అందించాడు. ఈ చిత్రం తరువాత రవితేజ తమిళ చిత్రం ‘బోగన్’ రీమేక్ లో నటిస్తాడని వార్తలొచ్చినా.. ఆ చిత్రం నుండి రవితేజ డ్రాప్ అయినట్లు తెలుస్తుంది.

శ్రీను వైట్లతో కలిసి….

అయితే గత చిత్రం ‘మిస్టర్’ తో ఘోర ప్లాప్ ను చవిచూసిన శ్రీనువైట్ల తదుపరి చిత్రం రవితేజతో చేస్తున్నాడని వార్తలొచ్చాయి. ఆ చిత్రం విషయంలో శ్రీను వైట్ల చాలా జాగ్రత్తగా ఉన్నాడని, ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే శ్రీను వైట్ల – రవితేజ కలిసి మూడు చిత్రాలు చేశారు. శ్రీనువైట్ల మొదటి చిత్రం ‘నీకోసం’ , ‘వెంకీ’, ‘దుబాయ్ శ్రీను’ చిత్రాలు చేశారు. ఈ చిత్రానికి ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కాజల్ ను కథానాయికగా ఎంపిక చేసే అవకాశముందని సమాచారం. ఈ చిత్రం వచ్చే సంవత్సరం మొదటి నెలలో పట్టాలెక్కనుంది అని తెలిసింది. ఈ చిత్రంతో శ్రీనువైట్ల ఎలాగైనా హిట్ కొట్టి మళ్ళీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ట్రై చేసున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1